»   » ఒకవేళ నేను చనిపోతే.. అమితాబ్ ట్వీట్‌పై దుమారం

ఒకవేళ నేను చనిపోతే.. అమితాబ్ ట్వీట్‌పై దుమారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకవేళ నేను చనిపోతే.. అమితాబ్ ట్వీట్‌పై దుమారం

లింగ సమానత్వంపై బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో తన గళాన్ని వినిపించారు. ఆడ, మగ అనే భేదం లేకుండా తన సంపదను సమాన మొత్తంగా తన కుమారుడు అభిషేక్, కూతురు నందాకు పంపిణీ చేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవున్నది. ఆస్తి పంపకాల కోసం ప్రచారం అవసరమా అనే వాదన వినిపిస్తున్నది.

ప్రపంచ ఫోర్బ్స్ జాబితాలో 18వ స్థానం

ప్రపంచ ఫోర్బ్స్ జాబితాలో 18వ స్థానం

ప్రపంచ ఫోర్బ్ జాబితాలో అమితాబ్ బచ్చన్‌కు 18వ స్థానం ఉంది. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకొనే నటుల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు. 70 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన సంపద రూ.133 కోట్లు.

శ్వేత, అభిషేక్ బచ్చన్ సంతానం

శ్వేత, అభిషేక్ బచ్చన్ సంతానం

భారత సినీ పరిశ్రమలో సెలబ్రిటీలకే సెలబ్రిటీ బిగ్ బీ. గత ఐదు దశాబ్దాలుగా పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆయనకు 42 ఏళ్ల కూతురు శ్వేతానంద, 41 ఏళ్ల కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. అభిషేక్ సినీ నటుడిగా రాణిస్తుండగా, నందా కాలమిస్ట్‌గా పనిచేస్తున్నది.

 నేను చనిపోతే ఆస్తిని ఇలా పంచాలి

నేను చనిపోతే ఆస్తిని ఇలా పంచాలి

గురువారం అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో ఓ ప్లకార్డును పట్టుకొని ప్రకటన చేశారు. దాని సారాంశమేమిటంటే.. ఒకవేళ నేను చనిపోతే.. నా ఆస్తులను నా కుమార్తే, నా కుమారుడికి సమానంగా పంచాలి అని #WeAreEqual, #GenderEquality హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేశారు.

బిగ్ బీ ప్రకటనపై స్పందన..

బిగ్ బీ ప్రకటనపై స్పందన..

అమితాబ్ ప్రకటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ ప్రకటనపై లక్షలాది మంది నుంచి ప్రశంసల వెల్లువెత్తుతున్నది. కాగా ఆస్తుల పంపకాలపై బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం లేదని కొందరు క్రిటిక్స్ అంటున్నారు.

మనవరాళ్లకు బీగ్ బీ సంచలన లేఖ

మనవరాళ్లకు బీగ్ బీ సంచలన లేఖ

గతేడాది బిగ్ బీ తన మనువరాళ్లకు సోషల్ మీడియాలో లేఖ రాయడం కూడా సంచలనం రేపింది. తన మనువరాలు నవ్య నవేలి, ఆరాధ్యకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తమ జీవితాన్ని తమకు ఇష్టం వచ్చినట్టు అనుభవించాలి అని లేఖలో పేర్కొన్నారు.

సర్కార్3 అమితాబ్ రెడీ

సర్కార్3 అమితాబ్ రెడీ

గతేడాది వజీర్, తీన్, పింక్ చిత్రాల్లో బిగ్ బీ నటించారు. ఈ ఏడాది సర్కార్ 3 చిత్రంలో నటించారు. త్వరలోనే అది విడుదల కానున్నది. బుధవారం విడుదలైన సర్కార్3 ట్రైలర్‌లో అమితాబ్ నటనపై మంచి స్పందన వ్యక్తమవుతున్నది.

English summary
Amitabh Bachchan announced on social media that in the interest of gender equality, he plans to leave an equal share of his wealth to his daughter Shweta Bachchan Nanda and son Abhishek Bachchan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu