»   » అమితాబ్ నోట..కన్నడ పాట!

అమితాబ్ నోట..కన్నడ పాట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అమృత ధారె" అనే కన్నడ చత్రంలో అమితాబ్ బచ్చన్ తో అతిధి పాత్ర పోషింపజేసిన కన్నడసీమ ఈ సారి ఓ కన్నడ చిత్రంలో ఆయనతో ఒక పాట పాడించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. సుప్రసిద్ద కన్నడ సంగీత దర్శకుడు హంసలేఖ ఈ బృహత్కార్యానికి సారధ్యం వహిస్తున్నారు. సౌందర్య జగదీష్ నిర్మిస్తున్న'అప్పు పప్పు" అనే చిత్రంలో ఓ పాటను అమితాబ్‍తోనే పాడించాలని ఆ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న హంసలేఖ విశ్వప్రయత్నం చేస్తున్నారు.

'ఈ విషయమై ఇప్పటికి రెండు పర్యాయాలు అమితాబ్‍ను కలిశాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. మానవతా విలువలకు అద్దం పడుతూ, కిరాతక చర్యలను ఎండగడుతూ సాగే ఈ పాట..అమితాబ్ గంభీర గాత్రం నుంచి వస్తేనే బాగుంటుందని నా నమ్మకం. అందుకే ఎలా అయినా ఆయనతోనే ఆ పాటను పాడించాలని నేను చేసిన సూచనను నా నిర్మాతలు కూడా వెంటనే అంగీకరించడం ఆనందంగా ఉంది. ఇంక అమితాబ్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం" అంటున్నారు హంసలేఖ!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu