డియర్ ఫ్రెండ్ నాగ్ అంటూ అమితాబ్ ట్వీట్.. 25 ఏళ్ల తరువాత అంటున్న వర్మ!
నాగార్జున, వర్మ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వస్తున్న చిత్రం ఆఫీసర్. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. నాగార్జున, వర్మ కాంబినేషన్ శివ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. శివ చిత్రంతోనే వర్మ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.
కాగా ఆఫిసర్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మాఫియా నేపథ్యంలో, యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది.

తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆఫీసర్ చిత్ర ట్రైలర్ గురించి ట్వీట్ చేసారు. డియర్ ఫ్రెండ్ నాగ్ నటించిన ఆఫీసర్ చిత్ర ట్రైలర్ అంటూ అమితాబ్ ట్వీట్ చేయడం విశేషం. అమితాబ్ ట్వీట్ కు రాంగోపాల్ వర్మ ప్రతిస్పందించారు. తాను, నాగార్జున 25 ఏళ్ల తరువాత కలసి చేసిన చిత్రం ఇది అని వర్మ అన్నారు.


Click it and Unblock the Notifications











