»   » అదిరిందయ్యా వర్మా..: వర్మ 'కంపెనీ' లోపల ఎలా ఉందో..చూస్తారా? (వీడియో)

అదిరిందయ్యా వర్మా..: వర్మ 'కంపెనీ' లోపల ఎలా ఉందో..చూస్తారా? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ని బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ సందర్శించారు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు వర్మ స్వయంగా ఆయన్ను కారు వద్దకు వెళ్లి రిసీవ్ చేసుకుని లోపలకి తీసుకు వచ్చారు. ఈ మొత్తాన్ని వీడియో తీసారు. ఆ వీడియోని పూరి జగన్నాథ్ తన ట్వీట్ తో మనకు అందచేసారు.

రామ్ గోపాల్ వర్మ, అమితాబ్ కలిసి గతంలో సర్కార్, సర్కార్ రాజ్, రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్, డిపార్టమెంట్ చిత్రాలు చేసారు. బుడ్డా హోగా తేరా బాప్ సినిమా విషయమై వర్మ ..అమితాబ్ ని టార్గెట్ చేస్తూ తిడుతూ ట్వీట్స్ చేయటంతో వీరిద్దరి మధ్యా విభేధాలు వచ్చినట్లు చెప్పుకున్నారు. దానికి తోడు డిపార్టమెంట్ సినిమా మధ్యలోంచి అభిషేక్ బచ్చన్ వెళ్లి పోవటంతో వర్మ మండిపడ్డారు.

అయితే ఈ విషయాలు ఏవీ అమితాబ్ సీరియస్ గా తీసుకోలేదు. సినిమాలు ఫ్లాఫ్ అయినంత మాత్రాన రిలేషన్స్ దెబ్బతింటాయని తాను అనుకోనని, వర్మ అంటే తనకు అసలు కోపం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వర్మ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. వర్మది పూర్తిగా క్రిమినల్ మైండ్ అని, క్రిమినల్ సినిమాలు బాగా తియ్యగలడని వ్యాఖ్యానం చేసారు.

మరో ప్రక్క వర్మ శిష్యుడు పూరి జగన్నాధ్..హైదరాబాద్ లో కేవ్ పేరుతో ఓ పెద్ద ఆఫీస్ పెడితే ..వర్మ ఏకంగా ముంబై కంపెనీ అంటూ పెద్ద ఆఫీస్ తెరిచారు. వర్మ అక్కడే పూర్తిగా ఉంటున్నారు. నిత్యం సినిమావాళ్లతో ఆ ఆఫీస్ కళకళ్లాడుతోంది. సాయింత్రం పార్టీలు, అమ్మాయిలతో ఆఫీస్ కన్నుల పండుగగా వెలుగుతోందని అక్కడ మీడియా అంటోంది.

English summary
The SARKAR of Bollywood Amitabh Bachchan Visits Director RGV'S COMPANY. The Satya behind Sarkar Amitabh Bachchan visiting RGV's Company.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu