For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్విట్టర్‌ లో ఏ హీరో కి ఫాలోయర్స్ ఎక్కువ?(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ఒకప్పుడు ఓ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే ఆయా ఊళ్లలో ఉన్న అభిమాన సంఘాలు...థియోటర్స్ వద్ద చేసే సందడే వేరు. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ కి సంభందించిన తాజా సమాచారం కోసం సినిమా పత్రికలు మీద ఆధారపడేవారు.

  తర్వాత కాలంలో న్యూస్ ఛానెల్స్ వచ్చిన తర్వాత, డైలీ న్యూస్ పేపర్లు సైతం అభిమానులను అలరించి సొమ్ము చేసుకునే కార్యక్రమం మొదలెట్టి...ఎప్పటికప్పడు అప్ డేట్స్ ఇవ్వటం మొదలెట్టాయి. ఇంకా కాలం ఈ నాలుగైదు ఏళ్లలో మారిపోయింది.

  ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ దే రాజ్యం. హీరోలు...ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉంటూ ప్రతీ క్షణం తమ అభిమానులకు అందుబాటులో ఉంటున్నాయి. దాంతో ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరోల లేదా హీరోయిన్స్ ట్విట్టర్ ఎక్కౌంట్ లను ఫాలోచేస్తూ వారిచ్చే ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ..ఎప్పకప్పుడు హీరోలకు సంభందించిన విషయాల్లో అప్ డేట్ అవుతున్నారు.

  ఈ నేపధ్యంలో ఏ హీరోకు మన దేశంలో ట్విట్టర్ ఎక్కువ ఫాలోయింగ్ ఉందీ అంటే... మీరీ క్రింద కథనం చదవాల్సిందే..

  స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

  బిగ్ బి

  బిగ్ బి

  10.4 మిలియన్‌ ఫాలోవర్స్‌తో బిగ్‌బీ అమితాబచ్చన్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఇచ్చి ట్వీట్స్ కేవలం సినిమాలకు సంభందించనే కాకుండా సమాజానికి సంభందించన విషయాలపై కూడా ఉండటంతో చాలా మంది దాన్ని ఫాలో అవుతున్నారు.

  షారూఖ్‌ ఖాన్‌

  షారూఖ్‌ ఖాన్‌

  బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌కు ట్విట్టర్‌లో అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆయన ట్విట్టర్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 9 మిలియన్లు దాటింది. దీంతో షారూఖ్‌ ట్విట్టర్‌లో అత్యధిక మంది అభిమానులను సాధించుకున్న రెండో భారతీయ నటుడిగా స్థానం సంపాదించారు. షారూఖ్‌ 2010 జనవరిలో ట్విట్టర్‌లో చేరగా, ఇప్పటికి 7,718 ట్వీట్లు చేశారు.

  అమీర్ ఖాన్

  అమీర్ ఖాన్

  నిరంతర ప్రయోగ శీలి అమీర్‌ ఖాన్‌ 8.46 మిలియన్ల ఫాలోవర్లతో షారూఖ్‌ కంటే కాస్త వెనుక ఉన్నారు. అమీర్ ఖాన్ చాలా తక్కువ ట్వీట్స్ చేస్తూంటారు. ఆయన నుంచే ట్వీట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూంటారు.

  సల్మాన్ ఖాన్

  సల్మాన్ ఖాన్

  ట్విట్టర్‌లో హీరో సల్మాన్‌ ఖాన్‌ 8.26 మిలియన్లు ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. సల్మాన్ ఖాన్ కు ఎక్కువగా మాస్ లో ఇమేజ్ ఉండటమే దానికి కారణం అంటున్నారు. మాస్ లో చాలా మందికి ట్విట్టర్ ఎక్కౌంట్ ఒకటుందనే సంగతి కూడా తెలియదు. లేకపోతే సల్మాన్ కు ఉన్న క్రేజ్ కు అందరికంటే ముందుండే వారు అని విశ్లేషకులు అంటున్నారు.,

  మహేష్

  మహేష్

  తెలుగు స్టార్ హీరోలు మహేష్ వంటివారు చాలా అరుదుగా ట్వీట్స్ చేస్తూంటారు. ఆయన కేవలం సినిమా ప్రమోషన్ సమయంలో మాత్రమే ట్వీట్స్ చేస్తూండటంతో బాలీవుడ్ హీరోలకు ఉన్నంత మనవాళ్లుకు ఉండటం లేదు.

  పవన్ కల్యాణ్

  పవన్ కల్యాణ్

  తెలుగు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు అసలు ట్విట్టర్ ఎక్కౌంట్ కూడా లేదు. ఆయన సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంటూంటారు. ఆయన మాటలు కన్నా చేతలే చెప్పాలని అంటూంటారు.

   ఎన్టీఆర్

  ఎన్టీఆర్

  జూ. ఎన్టీఆర్ సైతం చాలా అకేషనల్ గా ట్వీట్స్ చేస్తూంటారు. ఆయనకు కుమారుడు పుట్టినప్పుడు, తన బాబాయ్ బాలకృష్ణకు హెల్త్ బాగోనప్పుడు వంటి సందర్బాల్లో మాత్రమే ట్విట్టర్ వాడుతూ వస్తున్నారు.

  నిఖిల్, నితిన్

  నిఖిల్, నితిన్

  యంగ్ హీరోలు నిఖిల్, నితిన్ వంటివారు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నా...వారికి చెప్పుకోదగిన లేదా పోటీ పడదగ్గ రీతిలో ఫాలోయింగ్ లేదు.

  రామ్ చరణ్

  రామ్ చరణ్

  మెగా వారసుడు రామ్ చరణ్ ట్వీట్స్ కు మంచి ఆదరణే ఉందికానీ ఆయన కూడా చాలా అరుదుగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోకి వస్తూంటారు. అప్పుడప్పుడూ తను పెంచుకునే కుక్కల గురించో లేక తన సినిమా టీజర్ గురించో మాట్లాడుతూంటారు. రెగ్యులర్ గా ప్యాన్స్ తో ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ లో ఉండరు. అది కాస్త అభిమానులని నిరాసపరుస్తూంటుంది.

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  ఉన్నంతలో అల్లు అర్జున్, ఆయన సోదరుడు అల్లు శిరీష్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఏక్టివ్ గానే ఉంటూంటారు. అల్లు అర్జున్ తన కుటుంబానికి సంభందించిన పర్శనల్ ఫోటోలను అప్ లోడ్ చెయ్యటం వంటి వాటి ద్వారా ఆయన తన అబిమానులను ఆనందపరుస్తూంటారు. అంతే తప్ప రెగ్యులర్ గా ట్వీట్స్ తో టచ్ లో ఉండరు.

  సమంత

  సమంత

  తెలుగు వరకూ చెప్పాలంటే సమంత ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ తన వైపుకు తిప్పుకుంటూంటుంది. సమంతకు మంచి ఫాలోయింగే ఉంది. కొన్ని కొన్ని సార్లు ఆ ట్వీట్స్ కాంట్రావర్శీలు అయ్యాయి కూడా.

  రాజమౌళి

  రాజమౌళి

  తెలుగు దర్శకులలో సామాజిక మాద్యమాన్ని బాగా వాడుకుంటూ ఎప్పుటకప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండే ఏకైక దర్శకుడు రాజమౌళి. తను చూసిన సినిమా నుంచి తను వెళ్లిన హోటల్ దాకా ప్రతీ విషయం గురించి ఆయన పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూంటారు ఆయన.

  English summary
  Amitabh Bachchan No. 1 On Twitter, Followed By SRK, Salman.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X