»   » ఫ్యాన్సీ రేటుకు అమ్మ‌మ్మ‌గారిల్లు నైజాం రైట్స్!

ఫ్యాన్సీ రేటుకు అమ్మ‌మ్మ‌గారిల్లు నైజాం రైట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హ నిర్మాత‌గా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌ళ్యాణ ర‌మ‌ణ సంగీతం అదించారు. కాగా ఈ సినిమా ఆడియో హ‌క్కుల‌ను ఆదిత్య మ్యూజిక్ ద‌క్కించుకుంది. ఈ సినిమాలోని భాస్క‌ర భ‌ట్ల రచించిన చాలా చాలా అంటూ సాగే లిరిక‌ల్ వీడియో పాట‌ను ఆదివారం ఉద‌యం ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.

క‌ళ్యాణ ర‌మ‌ణ‌, గీతామాధురి ఈ పాట‌ను ఆల‌పించారు. అలాగే నైజాం ఏరియాలో హ‌క్కుల్ని గ్లోబ‌ల్ సినిమాస్ ఎల్. ఎల్. పి సంస్థ అధినేత ఏషియ‌న్ సునీల్ ఫ్యాన్సీ ధ‌ర‌కు చేజిక్కించుకుని రిలీజ్ చేస్తున్నారు. అన్ని ప‌నుల పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఇదేనెల‌లో రిలీజ్ అవుతుంది.

Ammamma Gari Illu

ఇత‌ర పాత్ర‌ల్లో రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ మురళి, సుమ‌న్, శివాజీ రాజా, ష‌క‌లక శంక‌ర్, సుమిత్ర‌, సుధ‌, హేమ, ఏడిద శ్రీరామ్, ర‌విప్ర‌కాష్, చ‌ల‌ప‌తిరావు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: క‌ళ్యాణ్ ర‌మ‌ణ‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సాయి కార్తిక్, ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తి, ఎడిటింగ్: జె.పి, పీఆర్.ఓ: సురేష్ కొండేటి, కొరియోగ్ర‌ఫీ: స‌్వ‌ర్ణ‌, ఫైట్స్: మ‌ల్లేష్ షావెలెన్, స‌హ నిర్మాత‌: కె.ఆర్, నిర్మాత‌: రాజేష్‌, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్ సూర్య‌.

English summary
After Success of Chalo, Naga Shaurya is coming up with a family drama called Ammamma Gari Illu. The film marks the return of Shamili (Siddharath starrer Oye). This movie satellite and Nizam right sold for fancy rate. Gemini Television acquired the rates for Rs.2.75 crores. Now this movie is in DTS Mixing stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X