మహేష్ హీరోయిన్ పై ..ఆటోడ్రైవర్‌ల దాడి

By Srikanya

Amrita Rao
హైదరాబాద్ :అమ్మాయిలపై దాడుల విషయంలో సెలబ్రెటీలకూ ఎలాంటి మినహాయింపు లేదు. మొన్న శ్రుతీహాసన్‌పై ఆగంతుకుడి దాడి సంఘటన మరువకముందే మహేశ్‌బాబుతో 'అతిథి'లో నటించిన అమృతారావుకి అటువంటి అనుభవమే ఎదురైంది. రీసెంట్ గా సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రం ప్మరోషన్ లో భాగంగా... వేరే చోటకి వెళ్లటం కోసం ముంబయి ఎయిర్‌పోర్టుకి కారులో వెళ్తున్న అమృత దారిలో నిర్మానుష్యంగా ఉన్నచోట ఓ ఆటోవాలా మహిళను బలాత్కారం చేయడానికి ప్రయత్నించడం చూసింది.

అది చూసిన అమృత కారాపి తన డ్రైవర్‌ సాయంతో అతడి బారి నుంచి ఆమెను కాపాడింది. వెంటనే పోలీసులకూ వివరాలు అందించింది. అది గమనించిన మరో ముగ్గురు ఆటోడ్రైవర్‌లు అమృతపై దాడికి ప్రయత్నించారు. అయితే ఆమె కారు డ్రైవర్‌ చాకచక్యంగా ఆమెను అక్కడి నుంచి తప్పించడంతో ప్రమాదం నుంచి బయటపడింది.

ఈ సంఘటనపై మాట్లాడుతూ 'ఆ రోజు జరిగిన సంఘటన నన్నెంతో బాధపెట్టింది. విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. ప్రతి ఆడపిల్లా బయటకెళ్లేప్పుడు తగిన స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి' అంటూ వివరిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X