'పెటా' కొత్త అంబాసిడర్ గా రామ్ చరణ్ హీరోయిన్

By Srikanya

హైదరాబాద్: ఎవడు సినిమా లో రాంచరణ్ సరసన నటించిన అమీ జాక్సన్ ఇప్పుడు పెటా అంబాసిడర్ గా మారింది. జంతు సంరక్షణా సంస్ధ పెటాకి ప్రచార కర్తగాఎంపిక అవటం తన అదృష్టం అని చెప్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... జంతువులకు దైవాలుగా మారండి..వాటిని దత్తత తీసుకోండి..కొనకండి అంటూ ట్వీట్ చేసింది. ఆమెతో పాటు త్రిష, ప్రియా ఆనంద్ కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే తాను ఇప్పటికే అల్బీ అనే పిల్లిని పెంచుతున్నట్లు చెప్తోంది.

షాపుల్లో జంతువులను కొనటం మాని..అనాధ జంతువులకు లైఫ్ ని ఇవ్వండి అంటోంది. ఏనుగుల సంరక్షణలో సైతం అమీ పాల్గొంటోంది. తమిళంలో 'మదరాసుపట్టణం' చిత్రంతో అడుగుపెట్టింది అమిజాక్సన్. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. తెలుగులో 'ఎవడు'లో రామ్‌చరణ్ సరసన నటించింది. ప్రస్తుతం విక్రమ్ సరసన 'ఐ'లో నటిస్తోంది.

శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి అమి మాట్లాడుతూ "ఈ సినిమాలో నేను నటించాల్సిన పాత్ర గురించి శంకర్‌గారు చెప్పగానే చాలా కొత్త అనుభూతి కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను వేరే లోకంలో ఉన్నట్టు ఫీలయ్యాను. భారతదేశపు ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలను శంకర్ సార్ విడమరిచి చెబుతుంటే నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదా? అనే బాధ కలుగుతోంది. మాటలకు అందనంత గొప్పగా, శ్రద్ధగా శంకర్ సార్ నా పాత్రను తీర్చిదిద్దారు. నా నడక, వస్త్రధారణ అంతా చాలా కొత్తగా ఉంటుంది. రషస్ చూసుకుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. లండన్ నుంచి వచ్చిన అమ్మాయినేనా అనే భ్రమ కలుగుతోంది'' అని చెప్పుకొచ్చింది అమీ జాక్సన్.

ఇక ఎవడు వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించడం పట్ల నాకు ఆనందంగా ఉంది.మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రామ్ చరణ్ రెండు షేడ్స్ లో యాక్టింగ్ చాలా బాగా చేశాడు. బాలివుడ్ రాం చరణ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయనతో కలిసి నటించడంతో నాకు కూడా అభిమానులు కలిగారు. దర్శకుడు పైడిపల్లి వంశీ నా కేరక్టర్ ను అద్భుతంగా మలచాడు. కేవలం, డ్యాన్సులు, గ్లామరే కాకుండా నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కథతో పాటు ట్రావెల్ అయ్యేలాగా నా క్యేరక్టర్ ను తీర్చి దిద్దాము. భారీ సినిమాలు తీసే ఓ బేనర్ లో నటించడం న అదృష్టం. ఈ టీమ్ తో పని చేయడం నేను ఎప్పటికీ మరచిపోలేను అన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X