Don't Miss!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Travel
వస్త్ర ప్రపంచానికి మన పెడన కలంకారి ఓ అలంకరణ!
- News
Jayalalithaa: జయలలిత కేసులో మళ్లీ ?, టైమ్ కావాలి సార్, ట్విస్ట్ లు, సీబీసీఐడీ ఎంట్రీ !
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న జబర్దస్త్ యాంకర్
ఈటీవీ జబర్దస్త్ షోతో పాటు పలు డిఫరెంట్ షోలతో ఆకట్టుకునే బ్యూటీఫుల్ యాంకర్ అనసూయా భరద్వాజ్ ఎలాంటి షో చేసినా బుల్లితెరపై క్లిక్కవ్వాల్సిందే. ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది బ్యూటీఫుల్ టివి యాంకర్స్ లో అనసూయ టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి. ఇక రియాలిటీ షోలలో ముఖ్యంగా రంగమ్మత్త తన మార్క్ గ్లామర్ షోతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇక మెల్లగా వెండితెరపై తన క్రేజ్ పెంచుకుంటున్న అనసూయ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో సర్ ప్రైజ్ ఇస్తోంది.
టాలీవుడ్ రంగమ్మత్తగా అనసూయ తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నాగార్జున సోగ్గాడే చిన్న నాయన సినిమాలో కూడా టైటిల్ సాంగ్ తో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ ఇవ్వనుందట. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఆ పాట చాలా హైలెట్ అవుతుందట.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సినిమా మార్చ్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అనసూయ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న రంగామార్తాండ సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో నటిస్తోంది. అందులో వినూత్నమైన నటనతో ఎట్రాక్ట్ చేయనుందట. రంగస్థలం సినిమాలో మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా కనిపించి అనసూయ ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో క్లాస్ ఆడియెన్స్ శభాష్ అనేలా దేవదాసిగా దర్శనమివ్వబోతోంది.

గుడిలో వచ్చే కొన్ని సీన్స్ లలో అనసూయ అద్భుతమైన నటనతో ఆడియెన్స్ కి సరికొత్త కిక్కివ్వనుందట. బయట ఎక్కడా కనిపించినా కూడా అభిమానులు ఆమెను ఎక్కువగా రంగమ్మత్త అంటూ స్వీట్ గా పిలవడం స్టార్ట్ చేశారు. ఇక రంగామార్తాండ చూసిన తరువాత అంతకు మించిన క్రేజ్ ఆ పాత్రతో అందుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.