twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anchor Anasuya: అనసూయ, రష్మీకి వేధింపులు, నిందితుడు అరెస్ట్.. అతను ఏం చేసేవాడంటే?

    |

    ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అప్ కమింగ్ హీరో హీరోయిన్లు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఈ ఫ్లాట్ ఫామ్ చక్కగా ఉపయోగపడుతోంది. అలాగే బాగా పాపులర్ అయిన, స్టార్ ఇమేజ్ ఉన్న సినీ సెలబ్రిటీలు సైతం సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ గా ఉంటారు. వారికి సంబంధించిన వ్యక్తిగత, కెరీర్, టూర్స్, రిలేషన్స్ షిప్స్ తదితర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇందుకోసం వాళ్ల ఫొటోలు సైతం షేర్ చేస్తుంటారు. అయితే దీన్ని అదనుగా చేసుకుని కొంతమంది సినీ సెలబ్రిటీలను వేధిస్తున్నారు.

    ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ..

    ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ..

    సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇదే అదనుగా కొంతమంది ఆకతాయిలు వారి పోస్ట్ లకు, ఫొటోలకు అసభ్యకరంగా కామెంట్స్ పెడుతూ వేధిస్తుంటారు. అలాగే వాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా రాస్తూ వాటిని వైరల్ చేస్తుంటారు. ఇలా సినీ సెలబ్రిటీలను తరచూ వేధిస్తుంటారు.

     అనసూయకు ఎక్కువైన వేధింపులు..

    అనసూయకు ఎక్కువైన వేధింపులు..

    టాలీవుడ్ యాంకర్స్ గా సూపర్ పాపులర్ అయిన వాళ్లలో అనసూయ, రష్మీ గౌతమ్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీళ్లు తరచుగా వాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే పలు ఫేక్ అకౌంట్స్ ద్వారా ఈ ఫోటోలకు, వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో వారు తీవ్ర వేదనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య యాంకర్ అనసూయకు వేధింపులు ఎక్కువయ్యాయి.

    ఏపీ కోనసీమకు చెందిన వ్యక్తి..

    ఏపీ కోనసీమకు చెందిన వ్యక్తి..

    యాంకర్ అనసూయను సోషల్ మీడియాలో వేధిస్తున్న నెటిజన్ ను పోలీసులు తాజాగా పట్టుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి పండరి రామ వెంకట వీర్రాజుగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా అనసూయను పండరి వెంకట వీర్రాజు వేధిస్తున్నాడు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

    కోనసీమలో మకాం వేసి..

    కోనసీమలో మకాం వేసి..

    యాంకర్ అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టే ఫొటోలు, వీడియోలకు అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్న పలువురు వ్యక్తులపై ఈ నెల 17న ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇన్ని రోజులు ముబైల్ పోన్స్ మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు పండరి వీర్రాజు. వారం రోజుల పాటు కోనసీమలో మకాం వేసిన పోలీసులు ఫైనల్ గా నిందితుడిని అరెస్ట్ చేశారు.

     అసభ్యకర రాతలు రాస్తూ..

    అసభ్యకర రాతలు రాస్తూ..


    యాంకర్ అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ ప్రకారం 354 (A)(D), 559, 67 (A), ఐటీ యాక్ట్ 2000, 2018 ప్రకారం నిందితుడు పండరి వీర్రాజును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్ లలో టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. "సాయి రవి 267" అనే ట్విటర్ అకౌంట్ ద్వారా హీరోయిన్స్ పెడుతున్నాడు పండరి వీర్రాజు.

    మంత్రి రోజా ఫొటోలు కూడా..

    మంత్రి రోజా ఫొటోలు కూడా..


    నిందితుడు పండరి వెంకట వీర్రాజు మూడేళ్ల పాటు దుబాయిలో ప్లంబర్ వర్క్ చేసినట్లుగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యాంకర్స్, హీరోయిన్స్ ను టార్గెట్ చేసి వాళ్లకు సంబంధించిన ఫొటోలతో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్, విష్ణుప్రియ, ప్రగతి, పవిత్రా లోకేష్ తోపాటు ఏపీ మంత్రి రోజా ఫొటోలు కూడా పోస్ట్ చేశాడు నిందితుడు.

    English summary
    Anchor Anasuya And Other Actress Morphing Photos Accused Pandari Venkata Veerraju Arrested In Konaseema By Cyber Crime Police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X