»   » సైరాలో రంగమ్మత్త.. అనసూయ ఏమదంటే!

సైరాలో రంగమ్మత్త.. అనసూయ ఏమదంటే!

Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో రాబోతున్న భవిష్యత్తు చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైనది.తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత గాధగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ తరహా చిత్రంలో తొలిసారి నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి. అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన అతిరథ మహా రధులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

తాజా మరో క్రేజీ సెలెబ్రిటీ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు పొందిన అనసూయ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది.

Anasuya response after Sye Raa rumours.

అనసూయకు మెగాస్టార్ సైరా చిత్రంలో క్రేజీ ఆఫర్ దక్కిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై స్వయంగా అనసూయ స్పందించింది. విజయవాడలో ఓ ఈవెంట్ కు హాజరైన అనసూయ దీనిపై స్పందించింది. ఈ ప్రతిపాదనతో తనని ఎవరూ సంప్రదించలేదని అనసూయ తెలిపింది. ఒకవేళ సైరా చిత్రంలో నటించే అవకాశం వస్తే అది తనకు గొప్ప అవకాశం అవుతుందని అనసూయ తెలిపింది.

English summary
Anasuya response after Sye Raa rumours. Anasuya got fame with Rangasthlam movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X