ఏంటి ఇలా మారిపోయాడు.. అల్లు అర్జున్‌పై అనసూయ కామెంట్స్
జబర్దస్త్ యాంకర్, వెండితెర నటి అనసూయ తాజాగా అల్లు అర్జున్ గురించి కామెంట్ చేసింది. బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ.. పుష్ప టీజర్‌పై కామెంట్ చేసింది. అయితే అనసూయ వేసిన ఈ ట్వీట్ వేరే లెవెల్‌లో ఉంది. ఎప్పటిలానే అనసూయ వేసిన ఈ ట్వీట్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారేట్టుంది. అల్లు అర్జున్‌ను పొగిడిన తీరుకు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఎందుకీ భజన అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అనసూయ అలా..
అనసూయ వేసే ట్వీట్లు, చేసే పోస్ట్‌లు ఎప్పుడూ కూడా అందరినీ తన దృష్టికి తిప్పుకునేలా ఉంటాయి. గత రెండు మూడు రోజులుగా అనసూయ తన లేటెస్ట్ ఇంటర్వ్యూతో ట్రెండ్ అవుతూనే వస్తోంది. కాంట్రవర్సీలపై నోరు విప్పుతూ ఆమె చేసిన కామెంట్లు మరింత వివాదానికి దారి తీస్తున్నాయి.

చావు కబురు చల్లగా ఈవెంట్‌లో..
చావు కబురు చల్లగా ఈవెంట్‌లో అనసూయ మాట్లాడుతూ పుష్ప గురించి కామెంట్ చేసింది. అందరూ కూడా పుష్పలో ఓ పాత్ర చేస్తున్నానని అనుకుంటున్నారు కానీ సుకుమార్ ఆ చాన్స్ ఇవ్వలేదు.. ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా.. నాకు పాత్ర ఇస్తారా? లేదా? అల్లు అర్జున్ పక్కన నటించాలి అంటూ స్టేజ్ మీదే అడిగేసింది అనసూయ.

తాజాగా ఇలా..
అలా ఆనాడు అనసూయ చేసిన కామెంట్లు బాగానే వైరల్ అయ్యాయి. బన్నీతో కలిసి నటించాలని ఉందనే కోరికను బయటపెట్టేసింది. అయితే తాజాగా అనసూయ మరోసారి హాట్ టాపిక్ అయింది. తాజాగా అల్లు అర్జున్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఏంటి ఇలా మారిపోయాడు..
ఈ మనిషి ఇలా ఎలా మారిపోయాడు.. సినిమా సినిమాకు.. క్యారెక్టర్ క్యారెక్టర్‌కు ఎంతో మార్పు ఉంటుంది.. నిజమైన ఆర్టిస్ట్.. పుష్ప రాజ్ అదరొగొట్టేశాడు.. బీస్ట్.. ప్యాన్ ఇండియన్ మూవీతో మమ్మల్ని గర్వపడేలా చేయండి అల్లు అర్జున్ గారు.. హ్యాపీ బర్త్ డే.. అని చెప్పుకొచ్చింది. ఇక అనసూయ వేసిన ట్వీట్‌పై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











