»   » యాంకర్ అనసూయకు రోడ్డు ప్రమాదం.. స్వల్పగాయాలు..

యాంకర్ అనసూయకు రోడ్డు ప్రమాదం.. స్వల్పగాయాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ యాంకర్ అనసూయ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు అనంతపురం జిల్లాలో ప్రమాదానికి గురైంది. అనంత జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఈ ప్రమాదంలో అనసూయ స్వల్పంగా గాయపడ్డినట్టు సమాచారం.

అనసూయ కారును..

అనసూయ కారును..

జాతీయ రహదారిపై అనసూయ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అనసూయ తలకు గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారును ఘటనా స్థలంలోనే వదిలి మరో కారులో అనసూయ బయల్దేరి వెళ్లినట్టు సమాచారం. అనంతరం రాప్తాడులోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. గాయపడిన అనసూయను చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

వేసవి విహార యాత్రకు వెళ్లి..

వేసవి విహార యాత్రకు వెళ్లి..

ఇటీవల సమ్మర్ వెకేషన్ కోసం కుటుంబ సమేతంగా కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతానికి వెళ్లారు. కూర్గ్‌లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్ లైవ్‌లో కనిపించారు. తన అభిమానులతో విహార యాత్ర అనుభవాలను పంచుకొన్నారు.

హైదరాబాద్‌కు వస్తుండగా..

హైదరాబాద్‌కు వస్తుండగా..

విహార యాత్రను ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఆమె పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించిన మీడియాకు అనసూయ అందుబాటులోకి రాలేదు. అయితే అనసూయకు తీవ్రగాయాలు కాలేదని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.

టాప్ యాంకర్‌గా..

టాప్ యాంకర్‌గా..

ప్రముఖ చానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ మీడియాలో టాప్ యాంకర్‌గా పేరు తెచ్చుకొన్నది. పలు టెలివిజన్ చానెళ్లలో గేమ్ షోలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నిర్వహించే కార్యక్రమాలకు వీక్షకుల నుంచి మంచి స్పందన కూడా ఉంది. టెలివిజన్ రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా ఆమె రాణిస్తున్నారు.

English summary
Top anchor Anasuya met an accident in Ananthapur district. Reports says that She had minor injuries in accident. After the incident she filed a complaint at Raptadu of Ananthapur district.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu