»   » గర్భవతిని.. అందుకే ఆయన కోరికను నిరాకరించా.. అనసూయ

గర్భవతిని.. అందుకే ఆయన కోరికను నిరాకరించా.. అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న యాంకర్ అనసూయ యమ స్పీడ్ మీద ఉన్నది. టెలివిజన్ రంగంలో షోల మీద షోలు చేస్తూనే సినీ పరిశ్రమలో వచ్చిన అవకాశాలను ఆమె అందిపుచ్చుకుంటున్నది. టెలివిజన్ షోలను మంచి రేటింగ్‌తో నడపడమే కాకుండా టాలీవుడ్‌లోనూ మంచి విజయాలను సాధిస్తున్నది.

పవన్‌కు నో.. సాయి ధరమ్‌కు ఓకే

పవన్‌కు నో.. సాయి ధరమ్‌కు ఓకే

ఐటెం సాంగ్స్‌కు అడ్డాగా మారిన అనసూయ అప్పట్లో అత్తారింటికి దారేది చిత్రంలో వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించడం, తాజాగా సాయిధరమ్ తేజ్ చిత్రానికి ఓకే చెప్పడం చర్చనీయాంశమైంది. పవన్ సరసన ప్రత్యేక పాటలో నటించే అవకాశాన్ని వదులుకోవడంపై ఫిలింనగర్‌లో టాక్‌గా మారింది. అయితే ఆ సమయంలో ఎందుకు పవన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందనే విషయంపై ఎవరికీ అంతుపట్టలేదు.

ఆ సమయంలో గర్భవతిని

ఆ సమయంలో గర్భవతిని

పవన్ ఆఫర్‌ను కాదనడానికి కారణం ఆ సమయంలో గర్భవతిగా ఉండటమేనని ఇటీవల అనసూయ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రంలో నటించే ఆఫర్ వస్తే ఎవరు కాదంటారు? అయితే నేనెందుకు కాదన్నానంటే.. ఆ సమయంలో నేను గర్భవతిని. అందుకే ఐటెం సాంగ్‌ను వదులుకోవాల్సి వచ్చింది' అని వివరించింది.

విన్నర్‌తో ఐటెం సాంగ్

విన్నర్‌తో ఐటెం సాంగ్

తాజాగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న విన్నర్ చిత్రంలో అనసూయ చేసిన ఐటెం సాంగ్‌‌కు మంచి రెస్సాన్ వస్తున్నది. సూయ, సూయ అనసూయ అనే పాటలో ఆమె చెసిన పాట సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తున్నది. గతంలో నాగార్జున అక్కినేనితో కలిసిసోగ్గాడే చిన్నినాయనాలోనూ వేసిన స్టెప్పులకు మంచి స్పందన వచ్చింది.

వివాదంలో అనసూయ ఐటమ్ సాంగ్

వివాదంలో అనసూయ ఐటమ్ సాంగ్

విన్నర్ చిత్రంలో అనసూయ చేసిన ఐటెం సాంగ్‌ వివాదాస్పదంగా మారింది. బుద్ధుడి ముందు ఈ పాటను చిత్రీకరించడంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దానిపై అనసూయ మండిపడింది. ఐటెంసాంగ్‌ను ఇటీవల ఫారిన్‌లో చిత్రీకరించాం. అక్కడ బార్‌లలో కూడా బుద్దుడి విగ్రహం పెట్టడం ఆనవాయితీ. దాంతో దాని ముందు చిత్రీకరించాల్సి వచ్చింది అని ఆమె వివరణ ఇచ్చారు.

English summary
Anchor Anasuya now hot in Tollywood and Television industry. Long back she rejected Pawan Kalyan's offer in Attarintiki daredi. Now Anasuya okayed Item song for Sai Dharam Tej's Winner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu