»   » అప్పట్లో పిచ్చి బట్టలేసుకుని నోటికొచ్చింది వాగాను: అనసూయ, బావగారూ అంటూ...!

అప్పట్లో పిచ్చి బట్టలేసుకుని నోటికొచ్చింది వాగాను: అనసూయ, బావగారూ అంటూ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu
అప్పట్లో పిచ్చి బట్టలేసుకుని నోటికొచ్చింది వాగాను : అనసూయ

డా.మోహ‌న్‌బాబు న‌టిస్తూ అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మిస్తున్న చిత్రం గాయ‌త్రి. మ‌ద‌న్ ద‌ర్శ‌కుడు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా జర్నలిస్టుగా కీలకమైన పాత్రలో నటించింది. ఈ సందర్భంగా అనసూయ ప్రసంగించడం, మధ్యలో హీరో విష్ణు కల్పించుకుని కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడం.... అందరినీ బాగా ఎంటర్టెన్ చేసింది.

మంచు ఫ్యామిలీ నన్ను ప్రోత్సహించింది

మంచు ఫ్యామిలీ నన్ను ప్రోత్సహించింది

మోహ‌న్‌బాబుగారితో క‌లిసి ప‌నిచేయ‌డం నా అదృష్టం. ఆయ‌నొక యూనివ‌ర్సిటీ. ఇత‌ర న‌టీన‌టుల‌కు ఆయ‌నెంతో ప్రోత్సాహం అందిస్తారు. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు అని అనసూయ తెలిపారు.

ఆ రోజుల్లో మంచు వారి ఆస్థాన యాంకర్‌గా ఏలాను

ఆ రోజుల్లో మంచు వారి ఆస్థాన యాంకర్‌గా ఏలాను

మోహన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్, డిసిప్లేన్‌గా ఉంటారు అని అందరూ చెప్పారు. ఆయనతో కలిసి పని చేయడం ఒక మంచి అనుభవం. ఒకానొక సమయంలో మంచు వారి ఆస్థాన యాంకర్‌గా ఏలాను... అని అనసూయ తెలిపారు.
అపుడు నేను పిచ్చి బట్టలేసుకుని...

అపుడు నేను పిచ్చి బట్టలేసుకుని...

మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య'తో మంచు ఫ్యామిలీ సినిమాకు తొలిసారి యాంకరింగ్ చేశాను. అపుడు నేను యాంకర్‌గా కెరీర్లో బేబీ స్టెప్స్ వేసుకుంటూ... పిచ్చి బట్టలేసుకుని, నోటికొచ్చింది వాగాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ సపోర్టు నాకు ఉంది. ఈ రోజు ఆయనతో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది అని అనసూయ తెలిపారు.


మనోజ్ సినిమా అపుడు నువ్వు చిన్న పిల్లవా?

మనోజ్ సినిమా అపుడు నువ్వు చిన్న పిల్లవా?

మధ్యలో హీరో విష్ణు కల్పించుకుని.... మనోజ్ సినిమా అపుడు నువ్వు చిన్నపిల్లవా? అంటూ ప్రశ్నించాడు. దీనికి అనసూయ స్పందిస్తూ.... ‘నా ప్రొఫెషన్ పరంగా నేను బేబీ స్టెప్స్ వేశాను, దాని అర్థం నేను చిన్న పిల్లను అని కాదు' అంటూ సమాధానం ఇచ్చింది.


బావగారు మీరేనా ఈ విషయం పట్టుకుంది?

బావగారు మీరేనా ఈ విషయం పట్టుకుంది?

బావగారు మీరేనా నా మాటల్లో ఈ విషయాన్ని పట్టుకుంది... అంటూ అనసూయ సభా ముఖంగా మోహన్ బాబును అడగటంతో అంతా ఆశ్చర్యపోయారు.


మా నాన్నను బావా అంటున్నావేంటి?

మా నాన్నను బావా అంటున్నావేంటి?

మళ్లీ మంచు విష్ణు కల్పించుకుని.... మా నాన్నగారిని బాబుగారు అన్నావా? బావగారు అన్నావా? మా అమ్మ ఇక్కడే ఉంది.... ఎందుకలా అన్నావ్ అంటూ ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అనసూయ స్పందిస్తూ నేను బావగారు అనలేదు, బాబుగారు అన్నాను అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.


మోహన్ బాబుగారితో చేయకుంటే ఏదో కోల్పోయినట్లే

మోహన్ బాబుగారితో చేయకుంటే ఏదో కోల్పోయినట్లే

తెలుగు సినిమా పరిశ్రమలో మోహన్ బాబు గారితో చేయకుంటే ఒక యాక్టర్‌గా ఏదో కోల్పోయినట్లే అని నా భావన. ఎప్పటికీ మంచు కుటుంబం వారి మంచు లాంటి చూపు మాత్రమే నాపై ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అనసూయ తెలిపారు.


English summary
Anchor Anasuya Speech at Gayatri Movie Audio Launch. Gayatri 2018 Movie ft. Dr. Mohan Babu M, Vishnu Manchu, Shriya Saran, Nikhila Vimal and Anasuya Bharadwaj Directed by Madan Ramigani, Story, Dialogues by Diamond Ratnababu, Music by SS. Thaman, Produced by Dr. Mohan babu M under Sree Lakshmi Prasanna Pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu