Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యాంకర్ హరితేజ గర్భవతి... కడుపులో పెరుగుతున్న బిడ్డ.. వీడియో వైరల్!
సినీ నటిగా, యాంకర్‌గా ఎన్నో పాత్రలతో ఆకట్టుకొంటున్న హరితేజ తన అభిమానులకు శుభవార్తను అందించింది. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన టాప్ యాంకర్ సాధారణ గృహిణిగా మారిపోయింది. త్వరలోనే తాను అద్భుతమైన మాతృత్వ అనుభూతిని పొందుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హరి తేజ సోషల్ మీడియాలో వెల్లడించిన ప్రకారం...

బుల్లితెరపై హరితేజ మ్యాజిక్
బుల్లితెరపై షోలు, యాంకరింగ్‌తో ఎంతో మంది అభిమానులను హరితేజ సొంతం చేసుకొన్నారు. స్టార్ మా, జెమినీ, ఈటీవీ లాంటి ప్రముఖ ఛానెల్స్‌లో సందడి చేశారు. కమెడియన్‌గా, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొన్నారు. సినీ నటిగా కూడా పలు సినిమాల్లో కనిపించారు. నటిగా, యాంకర్‌గా కొనసాగుతున్న సమయంలో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్‌బాస్ తొలి సీజన్‌లో స్ట్రాంగ్‌గా
తెలుగులో ప్రారంభమైన తొలి బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొన్నారు. వినోదంతోపాటు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆమె మరింత పాపులారిటీ సాధించారు. హరితేజ చెప్పిన హరికథ మరింత వినోదాన్ని పంచింది. దాదాపు చివరి వరకు ఆమె టైటిల్ కోసం పోటీపడ్డారు. టైటిల్‌కు అర్హత ఉన్న అభ్యర్థుల్లో తాను ఒకరనే ముద్రను వేసుకొన్నారు.

గర్భవతిని అంటూ వీడియో రిలీజ్
తాజాగా తాను గర్భవతిని అయ్యానంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ముద్దు పెట్టుకొంటూ డ్యాన్స్ చేశారు. తన గర్బాన్ని చూసుకొంటూ మురిసిపోయారు. ఆ వీడియోలో హరితేజ మరింత ఆనందంగాను, అందంగాను కనిపించింది.
Recommended Video

మాతృత్వం అనుభూతిని పొందుతూ..
తల్లిని కాబోతున్నాననే విషయం హరి తేజ జీవితంలో కొత్త వెలుగులు నింపినట్టు అర్ధమైంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోకు మంచి రెస్సాన్స్ వస్తున్నది. నెటిజన్లు, అభిమానులు హరితేజకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. అభినందనలతో తడిసి ముద్దవుతున్న హరితేజ మరింత సంతోషంలో మునిగిపోతూ వీడియోలో కనిపించింది. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతోపాటు యూట్యూబ్‌లో కూడా వైరల్ అవుతున్నది.