Just In
Don't Miss!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Finance
శాశ్వత నిషేధం, ఉద్యోగాల కోత ప్రారంభించిన టిక్‌టాక్
- Sports
World Tour Finals: ప్చ్.. తొలి రౌండ్లోనే ఓడిన సింధు, శ్రీకాంత్!!
- Automobiles
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
- News
వైసీపీలా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు , వైసీపీ ఓటమి తధ్యం : పంచాయతీ వార్ పై టీడీపీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇది కచ్చితంగా వింతే.. కలిసిపోయిన రవి లాస్య.. వాటిని చూపుతూ స్పెషల్ పోస్ట్
బుల్లితెరపై జంటగా రవి లాస్య, లాస్య రవి ఒకప్పుడు సృష్టించిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. బుల్లితెరపై ఇప్పుడు రష్మీ సుధీర్ ఎలా సెన్సేషన్ క్రియేట్ చేశారో.. ఒకప్పుడు రవి లాస్యలు అలా హాట్ టాపిక్ అయ్యారు. మ్యూజిక్ షో ద్వారా ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చి ఫుల్ పాపులార్టీ సంపాదించుకున్నారు. రవి లాస్య అని పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు కూడా ఉంటారా? అని అనేంత ఇమేజ్ తెచ్చుకున్నారు. సంథింగ్ స్పెషల్ అంటూ స్టార్ మా మ్యూజిక్ షోలో హైలెట్ అయ్యారు.

ఇద్దరూ ఒక్కటే..
రవి లాస్యలు ఇద్దరూ ఒక్కటే అనేంతగా క్రేజ్ వచ్చింది. మా మ్యూజిక్‌లో షో చేసినంత కాలం ఇద్దరి జోడి బాగానే ఉంది. ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ రూమర్లు కూడా వినిపించేవి.ఆ రూమర్లు కూడా ఆ షో హైప్ అయ్యేందుకు బాగానే ఉపయోగపడింది.

మధ్యలో గొడవలు..
ఆ రేంజ్‌లో ఇమేజ్ వచ్చాక ఎవరి మధ్యలో అయినా గొడవలు వస్తుంటాయి. అదే విధంగా రవి లాస్యల మధ్య కూడా గొడవలు వచ్చాయి. ఇగో, గర్వం వల్లనే ఇద్దరి మధ్య దూరం వచ్చిందంటూ లాస్య చెప్పుకొచ్చింది. రవి వల్లే తనకు పేరు వచ్చిందంటూ పదే పదే చెప్పుకోవడం నచ్చలేదంటూ లాస్య చెప్పుకొచ్చింది.

ఇద్దరి కృషి..
రవి లాస్య అనే ఇద్దరూ కూడా ఒకే షోతో ఫేమస్ అయ్యారు.. అంటే ఒకే విధంగా కెరీర్ ప్రారంభమైంది.. అలాంటప్పుడు సక్సెస్‌లో సరి సమానంగా షేర్ ఇవ్వాలి కదా అని లాస్య చెప్పుకొచ్చేది. కానీ రవి మాత్రం అలా ఉండకుండా తన వల్లే ఇంత పేరు వచ్చిందని చెప్పుకునే వాడట. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని లాస్య చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ షోలోనూ..
లాస్య బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలోనూ రవి ఆమెకు మాత్రం సపోర్ట్ చేయలేదు. టాప్ 5లోనూ ఉంటుందని కూడా చెప్పలేదు. ఆమె కంటే అరియానా కాస్త స్ట్రాంగ్ అంటూ లాస్యను టాప్ 5లో కూడా సెలెక్ట్ చేసుకోలేదు. కానీ బిగ్ బాస్ షోలో అభిజిత్ లాస్య ఇలా అందరూ చాలా క్లోజ్ అయ్యారు. అభిజిత్ యాంకర్ రవి ఇద్దరూ బంధువులు.

ఒక్కటయ్యారు..
అయితే తాజాగా కొత్త ఏడాది సందర్భంగా ఇద్దరూ ఒక్కటైనట్టు కనిపిస్తోంది. ఫ్రెండ్ షిప్ బ్యాండ్లతో దర్శనమిచ్చారు. టామ్ అండ్ జెర్రీ బ్యాక్ అంటూ రవి పోస్ట్ చేశాడు. దానికి లాస్య కూడా రిప్లై ఇచ్చింది. అయితే ఈ ఇద్దరూ ఇలా కలిసిపోవడానికి బ్యాక్ ఎండ్‌లో అభిజిత్ కారణమై ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే ఇలాంటి ఓ వింత జరిగింది.