»   » లాస్య ని మర్చిపోను, అవన్నీ వెంట్రుకతో సమానం: యాంకర్ రవి

లాస్య ని మర్చిపోను, అవన్నీ వెంట్రుకతో సమానం: యాంకర్ రవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర నటీమణి లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. బుల్లితెరకు దూరమై ఒక సినిమా ఛాన్స్ కొట్టేసిన లాస్య కెరీర్ దూసుకుపోతుందని అందరూ అనుకునేలోపే అమ్మడుకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. తాజాగా లాస్య నిశ్చితార్థం మరాఠి వ్యక్తి అయిన మంజునాధ్‌తో జరిగింది. అప్పటిదాకా అందరికీ ఒక అనుమానం ఉండేది రవీ లాస్య లమధ్య ఏదో ఉందీ అని. వారిద్దరి మధ్యా ఉండే సింక్ అలా అనుకోవటానికి కారణమై ఉండొచ్చు.

లాస్యనిశ్చితార్థ వేడుకలో రవి ఏడ్చేశాడని వార్తలొచ్చాయి. లాస్యను పక్కన బెట్టి శ్రీముఖితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రవితో బ్రేకప్ అయ్యాక లాస్య వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే లాస్య-శ్రీముఖిలతో తన పేరును లింక్ చేస్తూ వస్తున్న రూమర్లపై సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన రవి లాస్య విషయం లో వచ్చిన కొన్ని ప్రశ్నల విషయం లో బాగానే సీరియస్ అయ్యాడు. ఆ ప్రశ్నలకు తీవ్రంగానే స్పందించాడు కూడా

లాస్య సూసైడ్ :

లాస్య సూసైడ్ :

వీరిద్దరూ జోడీగా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కానీ ఆ టైమ్‌లో శ్రీముఖి రంగ‌ప్ర‌వేశంతో లాస్య కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ర‌వితో బ్రేక‌ప్ కావ‌డంతో లాస్య సూసైడ్ ఎటెంప్ట్ చేసింద‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి. దీనిపై లాస్య కూడా వివ‌ర‌ణ ఇచ్చింది.

 పర్సనల్ విషయం కిందే:

పర్సనల్ విషయం కిందే:


ఒక కార్య‌క్ర‌మంలో ర‌వి, లాస్యల రిలేష‌న్ గురించి సుమ కూడా అడిగేసింది. తామిద్ద‌ర‌ము మంచి స్నేహితుల‌మ‌ని వారు చెప్పేశారు. అయినా ఎవరూ నమ్మలేదు. అంతే కాదు మధ్యలో శ్రీ ముఖీ రవీ క్లోజ్ గా కనిపించటమూ, ఉన్నట్టుండీ లాస్య బుల్లితెరకి దూరం జరగటమూ రవి లాస్యల పర్సనల్ విషయం కిందే లెక్కేసి మాట్లాడుకున్నారు చాలా మంది.

 రాజా మీరు కేక:

రాజా మీరు కేక:


ఈమధ్యే ఒక లైవ్ చాట్ లో మాట్లాడిన రవి ఫ్యాన్స్ వేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ.. లాస్యను మరిచిపోయే ప్రసక్తే లేదని, ఆమె మంచి స్నేహితురాలని రవి చెప్పాడు. తనతో టచ్‌లో ఉంటున్నానని, లాస్య త్వరలోనే ‘రాజా మీరు కేక' అనే సినిమాతో మన ముందుకు వస్తుందని, ఆ సినిమా కోసం తాను కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు.

 మంచి కొలీగ్:

మంచి కొలీగ్:


తనకు ఆమెకు ఏదో ఉందని నెగటివ్‌గా రాస్తున్నారు. నెగటివ్ విషయాలను తాను పెద్దగా పట్టించుకోను. నెగటివ్ వార్తలను వెంట్రుకతో సమానంగా తీసిపారేస్తాననీ చెప్పిన రవి. శ్రీ ముఖి విషయం లో కూడా ఒక క్లారిటీ ఇచ్చేసడు. శ్రీముఖి తనకు మంచి కొలీగ్ అని, తామంతా షోలో భాగంగానే అలా బిహేవ్ చేస్తాం ,

 ముద్దులు పెట్టుకోవడం:

ముద్దులు పెట్టుకోవడం:


ముద్దులు పెట్టుకోవడం, తన్నుకోవడం వంటివి కేవలం షోలో భాగంగానే చేస్తాం తప్ప, వేరే ఉద్దేశం లేదని చెప్పాడు. తమ గురించి నెగటివ్‌గా రాస్తే అది ప్రమోషన్‌ గానే పనికొస్తుందని, టీవీల్లో కనిపించే మా గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటారని.. అది నెగటివ్ అయినా తన కెరీర్ కి ప్లస్సే అవుతుందని రవి అన్నాడు.

 మాట్లాడుకునే వెళ్తాం:

మాట్లాడుకునే వెళ్తాం:


ఇక బయట ఈవెంట్స్ కి కూడా తాము ముందుగానే మాట్లాడుకునే వెళ్తాం తప్పా, బయట వాళ్ళు అనుకున్నట్టు ఏమీ ఉండదని రవి తెలిపాడు. అంతే కాదు మేము పక్కా ప్రొఫెషనల్ అని కూడా ఆవేశంగా రవి చెప్పాడు.

English summary
Ravi and Srimukhi names have been circulating on the social media and TV channels for their chemistry in the short film. However, in a recent media interaction, Ravi cleared all the air on his affairs with Lasya and Srimukhi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu