»   » తన హెల్త్ కండీషన్‌పై యాంకర్ సుమ వివరణ

తన హెల్త్ కండీషన్‌పై యాంకర్ సుమ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో తిరుగులేని యాంకర్ దూసుకెలుతోంది యాంకర్ సుమ. టీవీ కార్యక్రమాల్లో వేలాది ఎపిసోడ్లు, వందలాది సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేసిన ఘటన ఆమెది. యాంకరింగ్ అంటేనే గలగలా అలుపు లేకుండా మాట్లాడటం. వందలు, వేలల్లో కార్యక్రమాలు చేసిన అలసి పోయిన సుమ గొంతు ఇటీవల కాలంలో ఇబ్బందుల్లో పడింది.

యాంకర్ సుమ గొంతు సమస్యను గమనించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... హైదరాబాద్ రాజ్ భవన్ రోడ్ లో ఉండే ఓ ప్రముఖ డాక్టర్‌(ఇ.ఎన్.టి స్పెషలిస్ట్)కు చూపించుకోవాలని సూచించాడు. ఆయన సూచన మేరకు సుమ ఆ డాక్టర్ ను సంప్రదించడంతో....రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 Anchor Suma about her health condition

వీళ్ళంతా టీవి నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చినవాళ్లే

గొంత సమస్య తీవ్రం కావడంతో సుమ ఇకపై యాంకరింగు చేసే అవకాశం లేదనే వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల మీడియాకు ఎదురుపడ్డ ఆమె తనపై ప్రచారంలోకి వచ్చిన రూమర్స్ మీదన స్పందించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, నా హెల్త్ కండీషన్ బాగానే ఉందని తెలిపారు. రూమర్స్ నమ్మ వద్దని స్పష్టం చేసారు.

ఇరవై మూడేళ్ల కెరీర్‌... వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ... ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ.

English summary
"Friends.., I'm all good..nothing serious about my health condition. Do not believe in false news doing rounds" Anchor Suma said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu