»   »  వావ్...! పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో ....! యాంకర్ ఉదయ భానుకు కవల పిల్లలు

వావ్...! పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో ....! యాంకర్ ఉదయ భానుకు కవల పిల్లలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాంకర్ గా ఉదయభాను హై సక్సెస్. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది. అయితే తాజాగా ఆమె గురించి ఓ వార్త మీడియాలోకు హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చింది.

అదేమిటంటే....ఇంతకాలం తర్వాత ఉదయభాను తల్లి కాబోతోందంటూ వెబ్‌ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. మొదట్లో చాలా మందే నమ్మలేదు. ఎందూకంటే గతం లో కూడా ఇలాంటి వార్తే వచ్చినప్పుడు. ఉదయ భాను అందరినీ ఏకిపారేసింది. అందుకే ఈసారి తొందరపడకుండా కంఫార్మ్ ఆయేదాకా ఎవ్వరూ ఏమీ మాట్లాదలేదు...

 Anchor Udaya Bhanu blessed with twins

దాదాపు కొన్ని నెలలుగా టీవీ కి దూరం గా ఉన్న ఉదయ భాను వారం రోజుల క్రితం మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. పెళ్ళయిన పన్నెండేళ్ళకి కవల పిల్లలని కనబోతున్నానంటూ ఆనందంగా చెప్పింది. ఈ స్టార్ యాంకర్. హైద‌రాబాద్ హాయిగా ఉన్నానని, తాను ప్ర‌స్తుతం తొమ్మిది నెలల గ‌ర్భ‌వ‌తిని అని చెప్పింది. మరో పది రోజుల్లో డెలీవ‌రీ డేట్ కూడా ఇచ్చార‌ని.. బొజ్జలో ఇద్దరు బుజ్జోళ్లో.. బుజ్జెమ్మలో ఉన్నారు... నా జీవితంలోనే చాలా ఆనందమైన క్షణాలను అనుభవిస్తున్నాను అని ఆమె తెలిపారు.

పెళ్ల‌యి ప‌దేళ్ల‌యినా త‌ర్వాత గ‌ర్భ‌వ‌తి కావ‌డంపై కూడా ఉద‌య‌భాను స్పందించారు. విజ‌యవాడ‌కు చెందిన విజ‌య్‌తో పెళ్లి అయిన‌పుడు తాముఫైనాన్షియ‌ల్‌గా జీరో స్టేజీలోఉన్న‌ట్లు చెప్పింది. అందుకే సెటిల్ కావ‌డానికి టైం ప‌ట్టింద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. రెండేళ్ల నుంచి పిల్‌ీల కోసం ప్లాన్ చేసిన‌ట్లు తెలిపింది. అంతేకాకుండా త‌నపై విమ‌ర్శ‌లు చేసిన వారిపై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.

 Anchor Udaya Bhanu blessed with twins

త‌న గురించి పూర్తిగా తెలియ‌ని వాళ్లు ఏది అనిపిస్తే అది వాగేస్తూ ఉంటారు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతలివాళ్లు మాట్లాడేవి పట్టించుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారేమో... ఒక్కోసారి బాధ అనిపిస్తుందన్నారు. ఈ ఫీల్డ్‌లో ఏ అమ్మాయి లైఫ్ అయినా ఒక గ్లాస్ హౌస్‌లో ఉన్నట్లుగా ఉంటుంది.. దాని మీద ఎవరైనా రాయి వేయొచ్చు... అది తగలకుండా జాగ్రత్తపడాలి. తగిలి నా ఎదుర్కొని... యుద్ధం చేయగల సాహసం ఉండాలని ఉద‌య‌భాను చెప్పారు.

ఇక తాజా న్యూస్ ఏమిటంటే ఈ రోజు ఉదయమే ఉదయ భాను శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఓ బాబు, పాపకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయభాను కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంకో కొన్ని గంతల్లో... పిల్లలతొ సహా కనిపించనుంది భానూ...

English summary
Star Anchor Udaya Bhanu Blessed with Twines... a baby Boy and Girl
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu