twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీలో మళ్ళీ టికెట్ల టెన్షన్.. మార్చవద్దంటూ సీఎంకి ఫిలిం ఛాంబర్ లేఖ

    |

    ఏపీలో సమసి పోయింది అనుకున్న సినిమా టిక్కెట్ల అంశం మీద మళ్ళీ రచ్చ మొదలయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం 69 మళ్ళీ రసాభాస అవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోకి కట్టుబడి థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకోవాలని కలెక్టర్ల ద్వారా ఒత్తిడి తీసుకు వస్తూ ఉండడంతో అందుకు వారు ఒప్పుకోవడం లేదు. ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ఒప్పందానికి యాజమాన్యాలు ససేమీరా అనడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

     ఫిలిం ఛాంబర్ లేఖ

    ఫిలిం ఛాంబర్ లేఖ

    ఏపీలో రోజు రోజుకు సినిమా ఆన్లైన్ టికెట్స్ వ్యవహారం ముదురుతోంది. తాజాగా ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. ఆన్లైన్ టికెట్స్ అమ్మకాలు , టికెట్స్ ఆదాయం ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరగాలని లేఖలో ఫిలిం ఛాంబర్ పేర్కొంది. ఆన్లైన్ టికెట్ సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా లింక్ ను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇస్తామని లేఖలో పేర్కొన్నారు.

    ముఖ్యమంత్రి దృష్టికి

    ముఖ్యమంత్రి దృష్టికి

    ఆన్లైన్ టికెట్స్ పై ప్రభుత్వం ఇచ్చిన 69 జీవో కంటే ప్రస్తుతం ఉన్న విధానం బాగుందని లేఖ పేర్కొన్నారు. ఎంవోయూలో పొందుపరిచిన విషయాలు వివరంగా లేవని, కాలపరిమితి తక్కువగా ఉందని లేఖలో ఫిలిం ఛాంబర్ పేర్కొంది. ఎంవోయూ పై సంతకాలు పెట్టమని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు అని ఫిలిం ఛాంబర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళింది. జీవో 69 వల్ల సినీ పరిశ్రమ దెబ్బ తింటుందంటూ లేఖలో వివరణ ఇచ్చారు.

    సమావేశమవుతారా?

    సమావేశమవుతారా?

    ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఫిలిం డెవలెప్మెంట్ టికెట్ అమ్మకాల ఆదాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పలేదని ఫిలిం ఛాంబర్ లేఖలో పేర్కొంది. అయితే మరి ఈ లేఖ మీద ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానే ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఈ విషయం మీద అనేక అనుమానాలు ఉన్న కారణంగా వివరణ ఇచ్చేందుకు సినిమాటోగ్రఫి అధికారులు ఛాంబర్ ప్రతినిధులతో సమావేశమవుతారా? అనేది చూడాల్సి ఉంది.

    ద్రుష్టి పెట్టే అవకాశం

    ద్రుష్టి పెట్టే అవకాశం

    ఇక ఈ విషయంలో మళ్ళీ పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగుతారా? అన్న విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే వారి దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ థియేటర్ల యజమానులు. ఇక ఇప్పటికే థియేటర్ కి ప్రేక్షకులు రావడం తగ్గడంతో ఈ విషయం మీద వారు కూడా కొంత ద్రుష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

    టెన్షన్

    టెన్షన్

    ఇప్పటికే టికెట్ ధరలు కొంత మేర పెరగడంతో ఆక్యుపెన్సీ తగ్గిందని అంటున్నారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా? అని థియేటర్ల యజమానులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే కొన్ని సినిమాలు పాత ధరలతో అంటే తక్కువ ధరలకే రిలీజ్ చేసినా ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో పరిశ్రమ పెద్దలకి టెన్షన్ గా మారడంతో ఈ విషయం మీద ఎలా ముందుకు వెళుతున్నారు అనేది చూడాల్సి ఉంది.

    English summary
    andhra pradesh film chamber writes a letter to ys jagan mohan reddy on online film tickets issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X