»   » నంది అవార్డుల ప్రకటన.. లెజెండ్ ఉత్తమ చిత్రం.. ఉత్తమ నటుడిగా బాలకృష్ణ

నంది అవార్డుల ప్రకటన.. లెజెండ్ ఉత్తమ చిత్రం.. ఉత్తమ నటుడిగా బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
నంది అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటుడిగా బాలయ్య

2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జ్యూరీ కమిటీ సభ్యులను వివరాలను వెల్లడించారు. కమిటీ ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఉత్తమ చిత్రాలు..

ఉత్తమ చిత్రాలు..

2014లో ఉత్తమ చిత్రంగా లెజెండ్, 2015లో ఉత్తమ చిత్రం బాహుబలి బిగినింగ్, 2016లో పెళ్లి చూపులు చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డులు లభించాయి.

2015లో ఉత్తమ ద్వితీయ చిత్రం ఎవడే సుబ్రమణ్యం, తృతీయ చిత్రం నేను శైలజ, ఉత్తమ కుటుంబ కథా చిత్రం మళ్లీ మళ్లీ ఇది రానిరోజు చిత్రాలు ఎంపికయ్యాయి.


2016లో ఉత్తమ ద్వితీయ చిత్రంగా అర్ధనారి, తృతీయ చిత్రంగా మనలో ఒకడు చిత్రాలు ఎంపికయ్యాయి.


ఉత్తమ నటులు

ఉత్తమ నటులు

2014లో ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (లెజెండ్), 2015లో ఉత్తమ నటుడు మహేశ్ బాబు (శ్రీమంతుడు) 2016లో ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు.


ఉత్తమ నటి

ఉత్తమ నటి

2014లో ఉత్తమ నటిగా అంజలి (గీతాంజలి), 2015లో అనుష్క (సైజ్ జీరో), 2016లో రీతూ వర్మ (పెళ్లి చూపులు) ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.


ఉత్తమ దర్శకుడు

ఉత్తమ దర్శకుడు

2014లో ఉత్తమ దర్శకుడిగా బోయపాటి శ్రీను, 2015లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి (బాహుబలి) ఎంపికయ్యారు.


ఎన్టీఆర్ జాతీయ అవార్డులు

ఎన్టీఆర్ జాతీయ అవార్డులు

2014లో కమల్ హాసన్‌కు, 2015లో రజనీకాంత్, 2016లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించారు.


బీఎన్‌రెడ్డి అవార్డులు

బీఎన్‌రెడ్డి అవార్డులు

2014 సంవత్సరానికి గానూ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి, 2015లో త్రివిక్రమ్ శ్రీనివాస్, 2016లో బోయపాటి శ్రీనుకు బీఎన్‌రెడ్డి అవార్డును ప్రకటించారు.


రఘుపతి వెంకయ్య అవార్డులు

రఘుపతి వెంకయ్య అవార్డులు

2014లో ప్రముఖ నటుడు కృష్ణంరాజుకు, 2015లో ఈశ్వర్‌కు, 2016లో చిరంజీవికి రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డును ప్రకటించారు.


చక్రపాణి, నాగిరెడ్డి అవార్డులు

చక్రపాణి, నాగిరెడ్డి అవార్డులు

2014లో నారాయణమూర్తి, 2015లో కీరవాణికి, 2016లో కేఎస్ రామారావుకు ప్రతిష్ఠాత్మక నాగిరెడ్డి, చక్రపాణి అవార్డుకు ఎంపిక చేశారు.


స్పెషల్ జ్యూరీ అవార్డులు

స్పెషల్ జ్యూరీ అవార్డులు

2014లో సుద్దాల అశోక్ తేజ, 2015లో పీసీ రెడ్డికి, 2016లో పరుచూరి బ్రదర్స్‌ను స్పెషల్ జ్యూరీ అవార్డులకు ఎంపిక చేశారు.


2014లో ఇతర అవార్డులు

2014లో ఇతర అవార్డులు

ఉత్తమ సహాయనటుడు నాగచైతన్య (మనం)
ఉత్తమ సహాయనటి మంచు లక్ష్మీ (చందమామ కథలు)
ఉత్తమ హాస్యనటుడు బ్రహ్మానందం (రేసు గుర్రం)
ఉత్తమ హాస్యనటి విద్యుల్లేఖ (రన్ రాజా రన్)
ఉత్తమ కెమెరామెన్ సాయిశ్రీ రామ్ (అలా ఎలా)
ఉత్తమ పాటల రచయిత చైతన్య ప్రసాద్ (బ్రోకర్2)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే)


 2015లో ఇతర అవార్డులు

2015లో ఇతర అవార్డులు

ఉత్తమ విలన్ రానా (బాహుబలి)
ఉత్తమ సంగీత దర్శకుడు (కీరవాణి)
ఉత్తమ సహాయనటుడు పోసాని కృష్ణమురళి
ఉత్తమ సహాయనటి రమ్యకృష్ణ
ఉత్తమ హాస్యనటుడు వెన్నెల కిశోర్
ఉత్తమ హాస్యనటి స్నిగ్ధ (జత కలిసే)
ఉత్తమ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా
ఉత్తమ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత కిషోర్ తిరుమల
ఉత్తమ కథా రచయిత
ఉత్తమ బాల నటుడు మాస్టర్ ఎన్టీఆర్ (దానవీరశూర కర్ణ)
ఉత్తమ బాలనటి (దానవీరశూర కర్ణ)


2016లో ఇతర అవార్డులు

2016లో ఇతర అవార్డులు

ఉత్తమ విలన్ ఆది పినిశెట్టి
ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్
ఉత్తమ సహాయనటుడు మోహన్ లాల్
ఉత్తమ సహాయనటి జయసుధ
ఉత్తమ హాస్యనటుడు సప్తగిరి
ఉత్తమ హాస్యనటి ప్రగతి
ఉత్తమ మాటల రచయిత అవసరాల
ఉత్తమ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత రవికాంత్ అడవి
ఉత్తమ కథా రచయిత కొరటాల శివ
ఉత్తమ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ (దండకారణ్యం)
ఉత్తమ గాయని చిన్మయి
ఉత్తమ బాల నటుడు మైఖేల్ గాంధీ
ఉత్తమ బాలనటి రైనారావు


English summary
Andhra Pradesh Government announced 2014, 2015, 2016 film awards, Balakrishna's Legend, Prabhas's Baahubali, Vijay devarakonda's Pelli Choopulu movie selected for best movie category.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu