Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pawan Kalyan Vs YS Jagan వకీల్ సాబ్‌కు ఏపీ సర్కార్ షాక్.. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ కోర్టులో కేసు
వకీల్ సాబ్ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించేలా చేస్తున్నది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీకి సంబంధించిన టికెట్ల రేట్లు పెంపు వ్యవహారం అత్యంత వివాదంగా మారనున్నట్టు కనిపిస్తున్నది. వకీల్ సాబ్ సినిమా వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్‌గా, పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

టాప్ హీరోల సినిమాల విషయంలో
టాలీవుడ్‌లో ఏ అగ్ర హీరో సినిమా గానీ లేదా భారీ బడ్జెట్ చిత్రంగానీ రిలీజ్ అయితే ప్రత్యేక షోలు, ఫ్యాన్స్ షోలకు అనుమతించడమే కాకుండా టికెట్ల రేట్లు పెంచుకోనేలా ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది. అయితే వకీల్ సాబ్ విషయంలో ఏపీ సర్కార్ ఇందుకు విరుద్దంగా ప్రవర్తించినట్టు కనిపిస్తుందనే వాదన సినీ వర్గాల్లోను, రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తున్నది.

వకీల్ సాబ్‌కు సానుకూలంగా హైకోర్టు తీర్పు
అయితే
టికెట్ల
రేట్ల
వ్యవహారంపై
ఆంధ్రప్రదేశ్
హైకోర్టు
సంచలన
తీర్పు
ఇచ్చింది.
వకీల్
సాబ్
సినిమా
టికెట్ల
రేట్లను
ఎగ్జిబిటర్లు
రానున్న
సోమవారం
వరకు
పెంచుకోవచ్చని
హైకోర్టు
ఆదేశాలు
జారీ
చేసింది.
డిస్టిబ్యూటర్లు,
ఎగ్జిబ్యూటర్లు,
నిర్మాతలు
దాఖలు
చేసిన
పిటిషన్‌కు
సానుకూలంగా
స్పందించింది.
ఈ
వ్యవహారానికి
వ్యతిరేకంగా
ఉన్న
ఏపీ
సర్కార్‌కు
షాక్
తగిలినట్టు
అయింది.

హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ సవాల్
అయితే
వకీల్
సాబ్
సినిమా
టికెట్ల
రేట్లు
పెంపు
విషయంలో
హైకోర్టు
ఇచ్చిన
తీర్పును
ఏపీ
సర్కార్
సవాల్
చేయాలని
నిర్ణయించింది.
ప్రభుత్వ
సలహాదారులు,
న్యాయనిపుణలతో
చర్చించిన
ఏపీ
ప్రభుత్వం
శనివారం
మోషన్
పిటిషన్‌ను
దాఖలు
చేయాలని
సంచలన
నిర్ణయం
తీసుకొన్నది.

ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు
గతంలో ఎన్నడూ లేని విధంగా వకీల్ సాబ్ సినిమాపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సినీ వర్గాలు, సినీ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న టికెట్ రేట్ల పెంపును అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు లక్షల రూపాయలు ఖర్చు చేసి సినిమాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

రికార్డు కలెక్షన్ల దిశగా
భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9 తేదీన రిలీజ్ అయిన వకీల్ సాబ్ రికార్డు దిశగా వసూళ్లను రాబట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సంచలన రీతిలో అడ్వాన్సు బుకింగ్ నమోదైంది. దాదాపు 32 కోట్ల మేర కలెక్షన్లను సాధించే అవకాశం ఉందనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.