»   » శాతకర్ణి కోపం ఇలాగా..?? సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని ఐఫోన్ విసిరేసి.. అలా..

శాతకర్ణి కోపం ఇలాగా..?? సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని ఐఫోన్ విసిరేసి.. అలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 'ఓ అభిమాని బాలయ్యకు అతి సమీపానికి వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అతడి చేతిని బాలయ్య నెట్టేయడం.. ఫోన్ కిందపడడం' ఆ వీడియోలో కనిపిస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ప్రీమియం షో లో బాలయ్య బాబు రెచ్చిపోయారు. ఓ అభిమాని బాలయ్య బాబుతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేసిన సమయంలో అభిమాని ఐ ఫోన్ ని విసిరి కొట్టాడు బాలయ్య. దీనితో అభిమాని నొచ్చుకున్నాడు. ఆ తరువాత బాలయ్య వెళుతూ అతని వైపు ఆగ్రహంతో 'ఇప్పుడు సెల్ఫీ ఏమిటి ' అని కోపంతో వెళ్లి పోయాడు.

ఈ వీడియోపై ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. నందమూరి యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోతో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. చాలామంది నెటిజన్లు కూడా బాలయ్య ఇలా చేసుండకూడదని చెబుతున్నారు. మరికొంతమందేమో అభిమానులదే తప్పన్నట్టు సెటైరికల్‌గా పోస్టులు పెడుతున్నారు. అభిమానిగా మనం అడిగితే.. వాళ్లు నవ్వుతూ మనకు సమయం ఇచ్చిన్నప్పుడు మాత్రమే మనం ఫొటోలు కానీ, సెల్ఫీలు కానీ తీసుకుంటే.. అభిమానులు అని చెప్పుకోవడానికి మనకు.. హీరోలమని చెప్పుకోవడానికి వాళ్లకు గర్వంగా ఉంటుందని చెబుతూ.. ఎవరికి అసహనం కలిగినా.. అభ్యంతరం కలిగినా.. ఇద్దరికీ మంచిది కాదని చెబుతున్నారు.అయితే అదే థియేటర్ వద్ద.. ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న పలువురు అభిమానులు 'థియేటర్‌ లోపల ఓ అమ్మాయి అడిగితే కాదనకుండా లేచి, నిలబడి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన బాలయ్య.. థియేటర్ బయట ఓ అబ్బాయి సెల్ఫీ తీసుకుంటుండగా ఇలా చేయడమేంటి' అని అడుగుతున్నారు. 'నటసార్వభౌమ నందమూరి తారకరాముడి కుమారుడిగా నటనలోనూ, రాజకీయంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ.. అభిమానులతో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. లేదంటే అక్కడ క్రౌడ్ అంతా క్లియర్ చేశాక బాలయ్య బయటకు వచ్చుంటే ఇలా జరిగే అవకాశం ఉండేదికాదేమో' అని బాలయ్య అభిమానులు కొంతమంది అభిప్రాయపడ్డారు.

English summary
Here comes the turn of Nandamuri Balakrishna now as he slaps a fan's hand yesterday. When he's leaving the premiere show today at Hyderabad, actually Balayya got mobbed by fans and one of them actually tried to click a selfie with him. Irritated Balayya has hit his hand, which made the phone get tossed into air.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu