»   »  పోలీస్ కేసు పెడతా... కోపంగా కత్రినా, జర్నలిస్ట్ కు వార్నింగ్, ఏం జరిగింది?

పోలీస్ కేసు పెడతా... కోపంగా కత్రినా, జర్నలిస్ట్ కు వార్నింగ్, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వివాదాలకు సాధారణంగా దూరంగా ఉంటూంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. అయితే ఒక్కోసారి అనుకోని పరిస్దితులు, లవ్ ఎఫైర్స్ ఆమెను వివాదాల్లోకి లాగి మీడియా మెయిన్ హెడ్ లైన్స్ కు ఎక్కిస్తూంటాయి.

తాజాగా కత్రనాకైఫ్ మరోసారి మీడియా పై ఆగ్రహించి మీడియాకు ఎక్కింది. అయితే ఈ సారి ఎంత సీరియస్ అయ్యిందంటే మీ మీద పోలీస కంప్లైంట్ ఇస్తాను అని రెచ్చిపోయి అరిచేసింది. తన ప్రైవసీకు భంగం కలిగిస్తున్నారంటూ కేసు పెడతానని మీడియా ప్రతినిధులను భయపెట్టే ప్రయత్నం చేసింది.

దీనికంతటికీ కారణం...ఆమె ఓ డాన్స్ రిహాల్సల్స్ నుంచి బయిటకు వస్తూంటే మీడియా ఫొటో జర్నలిస్టులు చుట్టు ముట్టడమే. ఊహించని పరిణామానికి ఆమె అవాక్కైంది. అక్కడ మీడియావారు వెయిట్ చేస్తారని ఆమె ఊహించకపోవటంతో షాకై ఆగ్రహం తెచ్చుకుంది. అలాగే ఆమె పర్శనల్ పనులుకు అర్జెంటుగా వెళ్లాల్సి రావటం మీడియా వెనక బడటం కూడా మండిపోయేలా చేసింది.

అయితే ఈ మీడియావాళ్లు ఊరుకుంటారా..ఆమె ను సీక్రెట్ గా వెంబడించి, ఫొటోలు క్లిక్ మనిపించేసారు. నువ్వు పోలీస్ కేసు పెట్టుకో, ఇంకోటి చెయ్య కానీ మాకు మాత్రం నీ ఫొటోలు కావాలి అన్నట్లుగా బిహేవ్ చేసారు. దాంతో ఈ విషయమై బాలీవుడ్ పెద్దలు సైతం మండిపడుతున్నారు. కత్రినా కోపం అయితే ఇక చెప్పక్కర్లేదు.

కత్రినా ఫొటోలు, అక్కడేం జరిగిందో విషయాలు చదవండి

గణేష్ ఆచార్య వద్ద నుంచి

గణేష్ ఆచార్య వద్ద నుంచి

ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే కత్రినా...కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టూడియోనుంచి బయిటకువస్తున్నప్పుడు

అక్కడికి ఎందుకు

అక్కడికి ఎందుకు

గణేష్ ఆచార్య స్టూడియోకు వెళ్లటానికి కారణం ఆమె వరల్డ్ టూర్ కోసం రిహార్సల్స్ చేస్తోంది.

డాక్టర్

డాక్టర్


అదే సమయంలో అక్కడకి ఓ డాక్టర్ సైతం వచ్చి ఆమెను చెక్ చేసి వెళ్లారు.

కారు ఎక్కేటప్పుడు

కారు ఎక్కేటప్పుడు

కత్రినా కారు ఎక్కేటప్పుడు కొంతమంది ఫొటో గ్రాఫర్స్ ఉండి, ఆమె సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు ఉన్న కత్రినా ఫొటోలు తీయబోయారు

దాంతో ..

దాంతో ..

తను సరిగ్గా డ్రస్ అదీ లేనప్పుడు ఫొటోలు బయిటకు వెళ్లటం కత్రినాకు నచ్చలేదు. అందుకే సీరియస్ అయ్యింది.

కారు దిగి వార్నింగ్

కారు దిగి వార్నింగ్

కత్రినా వెంటనే కారు దిగి ..ఆ ఫొటో గ్రాఫర్ కు వార్నింగ్ ఇచ్చింది. పోలీస్ లకు పట్టిస్తానని సీరియస్ గా చెప్పింది.

ఇదే తొలిసారి కాదు

ఇదే తొలిసారి కాదు

కత్రినాకైఫ్ ఇలా పేపారాజీలతో ఇబ్బంది పడటం తొలిసారి కాదు. గతంలోనూ చాలా సార్లు ఇలా జరిగింది.

సెలబ్రెటీ మేనజర్ తో

సెలబ్రెటీ మేనజర్ తో

సెలబ్రెటీ మేనేజర్ రేష్మా శెట్టి తో ఉన్నప్పుడు మీడియావారు ఆమెను హాంట్ చేసారు మీడియావారు. రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయ్యినప్పుడు ప్రశ్నలు అడగటానికి

ఎయిర్ పోర్ట్ లో

ఎయిర్ పోర్ట్ లో

ఓ సారి ఎయిర్ పోర్ట్ లోనూ ఇలాగే మీడియావారిని వార్న్ చేసింది. తనను ఫొటోలు తీయటానికి ఎవరు అనుమతి ఇచ్చారని అరిచింది.

కేవలం మా జాబ్స్ మాత్రమే

కేవలం మా జాబ్స్ మాత్రమే

మీడియావారు అనేది ఏమిటంటే...కత్రినా అంటే మాకేమీ కోపం లేదు.. మేము మా డ్యూటీలో భాగంగా ఆమె ఫొటోలు తీయటానికి ప్రయత్నిస్తున్నాం ..అంతకు మించి మరేమీ లేదు అని చెప్తున్నారు.

పద్దతి కాదు

పద్దతి కాదు

సెలబ్రెటీలకు కూడా కొంత స్పేస్ ఇవ్వాలి..వారి పర్శనల్ లైఫ్ లకు భంగం కలిగించరాదని సెలబ్రెటీలు అంటున్నారు.

అక్కర్లేని ప్రశ్నలు

అక్కర్లేని ప్రశ్నలు

ఫొటోలుతో సరిపెట్టరని, కో స్టార్స్ మధ్య విభేదాలు సృష్టించే ప్రశ్నలు అడుగుతారని, తాము ప్రిపేర్ గా ఉండనప్పుడు నోరు జారతాం అని అప్పుడు ఇరికించి మీడియా సొమ్ము చేసుకుంటోందని ఆరోపిస్తోంది.

English summary
Katrina Kaif stepped out of choreographer Ganesh Acharya's studio after a dance rehearsal. Katrina was rehearsing for her upcoming world tour there and was not feeling too well. Apparently, a doctor had been called in to check on her. Soon enough, she packed up and left.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu