twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ లైవ్ యాంకర్ పై ఫైర్ అయిన ప్రకాష్ రాజ్, కోపంగా లేచి వచ్చేసాడు (వీడియో)

    By Srikanya
    |

    బెంగళూరు: ప్రకాష్ రాజ్ లాంటి నటుడు వస్తే టీవీ ఛానెల్ వాళ్లకు కనపడితే... వారు ఊరుకుంటారా..కెలికిపాడేయరు. ఏదో ఒకటి చేసి కంట్రవర్శి చేసి, టీఆర్పిలు తెప్పించుకుందామని వారి ఆలోచన. కానీ అలాంటి సున్నిత విషయాలు టీవి లైవ్ లో మాట్లాడితే ఇంకేమైనా ఉందా...అందుకే ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు.వాక్ అవుట్ అన్నట్లుగా లైవ్ మధ్యలో బయిటకు వచ్చేసారు.

    ప్రకాష్ రాజ్ ప్రస్తుతం మనవూరి రామాయణం ప్రమోషన్ లో ఉన్నారు. ఇందు నిమిత్తం ఆయన ఛానెల్స్ కు ఇంటర్వూ ఇచ్చారు. . కన్నడంలో ఓ ఛానెల్ వారు ఆ ఇంటర్వూలో వెల్లగానే భాగంగా అన్నట్లుగా.., కర్ణాటక, తమిళనాడు మధ్య నలుగుతున్న కావేరీ జల వివాదం గురించి ప్రశ్నించారు. ఆయన స్పందన కోసం అందరూ ఆసక్తిగా చూసారు.

    ప్రకాష్ రాజ్ కు సీన్ అర్దమైంది. తనను ఇరికించి వాళ్ళు టీఆర్పీలు పెంచుకునే స్కీమ్ లో ఉన్నారని. దాంతో ఆయన యాంకర్ పై మండిపడ్డారు. అరిచారు. నేను ఇక్కడకు వచ్చింది నా సినిమా గురించి మాట్లాడటానికి , మీరు అడుగుతున్నది ఓ పొలిటికల్ ఇష్యూ, నన్ను ఎందుకు అందులోకి లాగుతారు అన్నారాయన. అలాగే ఇంకెప్పుడూ ఆ ఛానెల్ ను తన ఇంటర్వూకి రావద్దని చెప్పారు. ఇక ఆయన రీసెంట్ గా ఇంటర్వూ ఇచ్చి తన మనస్సులోని మాటలను బయిటపెట్టారు.

     అహంకారం ఉంది...

    అహంకారం ఉంది...

    నా అంతటి వాడు లేడనే అహంకారం వేరు. పాండిత్యం ఉండడం వల్ల కలిగే ధిషణాహంకారం వేరు. ఆత్రేయ గారితో 'ఏవండీ మీరు బాగా రాస్తారు కానీ రాత్రైతే తాగుతారట, అదంట, ఇదంట' అని ఎవరో అన్నారట! దానికి ఆయన, 'నాయనా! చెడు చూసినవాళ్లకి చెడు. మంచి చూసిన వాళ్లకి మంచి' అన్నారట! రాజాగారూ మనిషేగా! పెద్దరికాన్ని గౌరవించాలి. జడ్జ్ చేస్తే ఎలా?

     50 ఏళ్ల వయస్సులో తండ్రి అయ్యా

    50 ఏళ్ల వయస్సులో తండ్రి అయ్యా

    ముప్ఫై ఏళ్ళప్పుడు తండ్రి అయిన అనుభూతి వేరు. యాభై ఏళ్ళకి ఇప్పుడు కొడుకు పుట్టిన అనుభూతి వేరు. దేనికదే బాగుంది. దీనివల్ల నాకూ, నా భార్య - కొరియోగ్రాఫర్ పోనీవర్మకూ బంధం స్ట్రాంగ్ అవుతుంది. నా త ల్లి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, 'మాకు ఓ తమ్ముడు పుట్టాడు' అంటూ ఇద్దరు కూతుళ్ళూ రాఖీ కడుతుంటే హ్యాపీ అన్నారు ప్రకాష్ రాజ్

     నాకు తక్కువే ఇస్తున్నారు

    నాకు తక్కువే ఇస్తున్నారు

    దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడ్ని కాదు. నాకు, నా నటనకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నారు. ఆ మాటకొస్తే అంతకంటే తక్కువే ఇస్తున్నారు. నా దృష్టిలో రెండూ సమానమే. కోటి రూపాయలు ఇచ్చే పాత్ర కంటే, ఒక్క రూపాయి కూడా ఇవ్వని దర్శకత్వం నాకు ఎక్కువ సంతృప్తి ఇవొచ్చు. డబ్బుకి నేనెప్పుడూ విలువ ఇవ్వను. ఎందుకంటే డబ్బుకంటే చవకైన వస్తువుని నా జీవితంలో చూడలేదు. దర్శకత్వం అనేది నా జీవితానికి సరికొత్త అర్థం ఇస్తోంది అన్నారు ప్రకాష్ రాజ్.

    సిన్మాచూసి గ్రామాన్ని దత్తత తీసుకోలేదు

    సిన్మాచూసి గ్రామాన్ని దత్తత తీసుకోలేదు

    సిన్మా చూసి నేనెందుకు చేస్తా? నాకెక్కడో అనిపించింది, చేశానంతే. అయినా ఊరిని దత్తత తీసుకుని, వాళ్లకు అన్నం పెట్టగానే సరిపోదు. సమస్యలు తెలుసుకోవాలి, తీర్చాలి. ఊరి జనం తమ కాళ్ళపై నిలబడేలా చేయూతనివ్వాలి. ఊరిని దత్తత తీసుకోడానికి డబ్బు కన్నా మనసు, టైమ్, కమిట్‌మెంటే అవసరం! అన్నారు.

     నా కూతురు లండన్ లో చదువుతోంది

    నా కూతురు లండన్ లో చదువుతోంది

    నా ఊరు, నా జాతి ఏంటి? ఐ యామ్ ఎ వరల్డ్ సిటిజన్. నాకు మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో పొలం ఉంది. నేనక్కడికి వెళుతున్నప్పుడు ఆ ఊరి పరిస్థితి కనిపించింది. చదువుకోవాల్సిన పిల్లలు ఆడుకుంటున్నారు. అరే..నా కూతురు లండన్‌లో చదువుతోంది. తన ఏడాది ఫీజుతో ఇక్కడ వందమంది చదువుతారనిపించింది.

     కూర్చుని తినాలంటే కుదరదు

    కూర్చుని తినాలంటే కుదరదు

    ఎవరి పిల్లలైనా తమకు తాము కష్టపడి సంపాదించుకోవాలి. కూర్చొని తినాలంటే కుదరదు. 'నా సంపాదనలో మీ వాటా మీ ఇష్టం. నా వాటాలో కొంత వీటికి ఖర్చు పెడతా' అని ఇంట్లో డిస్కస్ చేస్తా. నా పెద్ద కూతురు మేఘన లండన్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతోంది. మంచి పెయింటర్. సెలవుల్లో సోషల్‌సర్వీస్‌కి వివిధ ప్రాంతాలకెళుతుంది. ఆ మధ్య 15 రోజులు ట్రైబల్ ఏరియాకెళ్లొచ్చింది. తనకి నా గుణాలొచ్చాయి.

    లక్లలాది కారణాలు

    లక్లలాది కారణాలు

    ప్రతీ మనిషి ఎదుగుదలకు లక్షలాది కారణాలు. ఇంతెత్తున ఉన్నప్పుడు కింద ఉన్నవాళ్లనీ చూడాలి కదా? నేనూ ఇంకొకరి జీవితాల్లో నా చేతనైనంత వెలుగు నింపాలి కదా? అదే చేస్తున్నా. అందుకే కొండారెడ్డి పల్లెని దత్తత తీసుకొన్నా. వాళ్లు కోరుకొంటోంది డబ్బు కాదు. సాయం. అందుకే చెక్కులు రాసి చేతులు దులుపుకోవడం ఇష్టం లేదు. వాళ్లతో కలసి పనిచేస్తూ.. ఊరిని బాగు చేస్తున్నా. నాతో వారు ఏం పొందిందో నాకు తెలీదు. కానీ నాకు మాత్రం ఎనలేని సంతృప్తినిచ్చింది అన్నారు ప్రకాష్ రాజ్.

     చెట్లు మధ్యన ఇల్లు

    చెట్లు మధ్యన ఇల్లు

    ‘‘మా తాతలు వ్యవసాయం చేసేవాళ్లు. అందుకే అటువైపు ఇష్టం ఏర్పడిందేమో? నగరానికి దూరంగా చెట్ల మధ్య ఓ ఇల్లు కట్టుకొందాం అనిపించింది. అలా ఫామ్‌ హౌస్‌ ఆలోచన వచ్చింది. ఇక వంట ఆకలికి సంబంధించినది కాదు. అందులో ఓ సంస్కృతి ఉంది. వండడంలోని ఆనందం నాకు బాగా ఇష్టం'' అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

     ఇంకొంచెం టైమ్ మిగులుతోంది

    ఇంకొంచెం టైమ్ మిగులుతోంది

    నటన, దర్శకత్వం, నిర్మాణం వీటితో పాటు పుస్తకాలు, వ్యవసాయం, వంటలు, సామాజిక సేవ. 24 గంటలూ సరిపోతున్నాయా? అంటే... ఇవన్నీ చేయగా ఇంకొంచెం టైమ్‌ మిగులుతోంది. బిజీగా ఉన్న మనిషికి ఇంకాస్త సమయం మిగులుతుంటుంది. ఎందుకంటే వాడికి టైమ్‌ విలువ తెలుసు కాబట్టి అన్నారు.

     తండ్రయ్యాక కొడుకుగా పనికిరానా?

    తండ్రయ్యాక కొడుకుగా పనికిరానా?

    నటన, దర్శకత్వం రెండు పడవల మీద ప్రయాణం అంటుంటారు. మీరు మాత్రం చాలా సులభంగా చేస్తున్నారు.. అంటే ...తండ్రయ్యాక కొడుకుగా పనికిరానా? నటన నటనే, దర్శకత్వం దర్శకత్వమే. దర్శకత్వం వహిస్తున్నప్పుడు నా పాత్ర మరొకరికి కట్టబెట్టడంలో కొన్ని సౌలభ్యాలు ఉండొచ్చు. దర్శకుడు ప్రకాష్‌ రాజ్‌ రాసుకొనే పాత్రలకు ఎవరు బాగా నప్పుతారో వాళ్లనే ఎంచుకొంటా. నాకు నటుడు ప్రకాష్‌ రాజ్‌ కావాలనిపిస్తోంది. కొన్ని పాత్రల్లో నటించడానికి ప్రకాష్‌ రాజ్‌ కంటే గొప్ప నటుడు నాకు కనిపించలేదు. అందుకే వాణ్ని తీసుకొన్నా అన్నారాయన.

    మంచితనం, రాక్షసత్వం పుట్టకతో రావు

    మంచితనం, రాక్షసత్వం పుట్టకతో రావు

    రామాయణం గాథ కాదు. భారతీయ జీవితం. ‘రాముడిలాంటి మొగుడు', ‘సీతలా లక్షణంగా ఉంది', ‘కుంభకర్ణుడిలా పడుకొన్నావ్‌', ‘తోక తక్కువ వీడికి'... ఇలా మనలో ఉన్న గుణాల్ని బట్టి ఆ పాత్రల్ని అన్వయించి మాట్లాడుతుంటాం. గుణానికి ఓ రూపం ఇస్తే రామాయణంలో పాత్రలు కళ్లముందు కదులుతుంటాయి. మనిషి మంచితనం, రాక్షసత్వం అనేవి పుట్టుకతో రావు. జీవన విధానం, మనకెదురయ్యే పరిస్థితులు మనల్ని మారుస్తుంటాయి.

     కామం గురించి, తొలి ముద్దు గురించి

    కామం గురించి, తొలి ముద్దు గురించి

    ప్రతీ ఒక్కరూ రాముడిలా ఉండడానికి ప్రయత్నిస్తారు. కనీసం నటిస్తారు. కానీ అతను రాముడా, రావణుడా, హనుమంతుడా? అనేది ఓ పెను సమస్య వచ్చినప్పుడో, తాను ఏకాంతంలో ఉన్నప్పుడో అర్థం అవుతుంది. నాకు తెలిసి ప్రతి మనిషీ పోయేటప్పుడు ఏదో ఓ రహస్యాన్ని కడుపులో పెట్టుకొని వెళ్తాడు. మనలోని కామం గురించి, మన తొలి ముద్దు గురించి ఎవరికి తెలుసు? ఇవన్నీ నిరూపించుకోవాల్సిన తరుణంలోనే మనిషి రాముడా, రాక్షసుడా అనేది అర్థం అవుతుంది. ‘మనఊరి రామాయణం'లోనూ అదే చెప్పబోతున్నా అని అననారు.

     ఆయన సంగీతంతో చెప్తారు

    ఆయన సంగీతంతో చెప్తారు

    నా సినిమాలకు సంగీతం అందించేది ఇళయరాజానే. ఆయనతో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం... ఆయన దగ్గరకు వెళ్తే తల్లి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఆయనో సంగీత సముద్రం. ఆ ఒడ్డున కూర్చుని ఎంతకాలమైనా గడిపేయొచ్చు. ఓ దర్శకుడు ఓ కథ చెప్పాలి. ఆ కథని రచయిత మాటల్లో, ఓ కళా దర్శకుడు సెట్లో, ఎడిటర్‌ తన ఎడిటింగ్‌ స్పీడ్‌లో చెప్పాలి. ఆయన సంగీతంతో చెప్తారు.

    తొలి సినిమా తీయందే

    తొలి సినిమా తీయందే


    నా దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాల గురించి చెప్పాలంటే..నా దృష్టిలో అవి సినిమాలు కావు. నాలోని ప్రసవ వేదన. అందులో విజయం సాధించానా, లేదా? అన్నది వేరే విషయం. ఓ సినిమా ఆడడానికి, ఆడకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. నాకు తెలిసి నా మొదటి సినిమా ఇంకా తీయలేదు. ఆ ప్రయత్నంలో ఉన్నా అన్నారు ప్రకాష్ రాజ్.

    నాకేదో తెలసిందని...

    నాకేదో తెలసిందని...

    నాకేదో తెలిసేసిందని దర్శకత్వం చేయ ట్లేదు. అంతా మంచి నటుడంటున్నారు. ఎక్కడో కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోయానేమో అనిపించింది. కొత్తగా ఉండాలంటే, మళ్ళీ పరీక్ష రాయాలనిపించింది. 200 మంది డెరైక్టర్లతో, ఎన్నో భాషల్లో, ఎన్నో క్యారెక్టర్లు చేశా. నాకూ కొన్ని విషయాలు చెప్పేందుకు న్నాయి. అవి పంచుకుందామనే డెరైక్షన్.

     అవి ఉభయకుశలోపలి అంతే..

    అవి ఉభయకుశలోపలి అంతే..

    'నాను నన్న కనసు', 'ధోని', 'ఉలవ చారు బిర్యానీ', 'మన ఊరి రామాయణం' - అన్నీ చిన్న చిన్న విషయాల్ని స్పృశించేవే. ఇవన్నీ ప్రేక్షకుడికీ, నాకూ మధ్య ఉభయ కుశలోపరి. అది చాలు, నేను సక్సెసైనట్లే!

     ఒక్కరోజు ఖాళీగా లేదు

    ఒక్కరోజు ఖాళీగా లేదు

    నటుడిగా ఒక్కరోజైనా ఖాళీగా లేను. తెలుగు, తమిళ, మలయాళ, హిందీల్లో నటిస్తున్నా. వ్యవసాయం చేస్తున్నా. దత్తత తీసుకున్న ఊరి వద్ద గడుపుతున్నా. కొడుకుతో ఆడుతున్నా. దేశాలు తిరుగుతున్నా. 'సిల సమయంగళిళ్' సినిమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కి వెళుతున్నా. టైమే లేదు! ఖాళీగా ఉన్నవాళ్లేదో అంటే, నాకేం!

     లేకుంటే జీవితం వ్యర్దం

    లేకుంటే జీవితం వ్యర్దం

    ఏ మనిషైనా కాలంతో పాటు ఎదగాలి. ప్రతిదీ ఆకలితో చూస్తూ, ఆకళింపు చేసుకుంటూ వెళ్ళాలి. జీవితానుభవాలు ఎక్కువవుతున్నకొద్దీ వ్యక్తిగా అవి మనకి అందమి వ్వాలి. లేకపోతే జీవితం వ్యర్థం. ఈ ప్రయాణంలో మనకిక చాలు అనాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. ఇతరులతో పంచుకోవాలి అన్నారు ప్రకాష్ రాజ్.

     బరువులూ తగ్గించుకోవాలి

    బరువులూ తగ్గించుకోవాలి

    ఏ మనిషీ తన వల్లే పెరగడు. పదిమందీ తనకిచ్చిన దాని వల్లే పెరుగుతాడు. 120 రూపాయలతో నటుణ్ణి కావాలని వస్తే నాకు ఇవాళ అందరి వల్ల ఇంత గుర్తింపు వచ్చింది. భోజనం కోసం కష్టపడాల్సిన పని లేదు! ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి, సమాజానికి తిరిగివ్వాలి. వెలగడం గొప్ప కాదు, వెలిగించడం గొప్ప! ఎదిగేకొద్దీ అన్ని రకాల బరువూ తగ్గించుకొని తేలిగ్గా మారితే బెటర్! ఆఖరికి పోయాక ఓ నలుగురు మనల్ని మోయాలిగా అన్నారు ప్రకాష్ రాజ్.

     ఇది ఒకరి గురించి కాదు

    ఇది ఒకరి గురించి కాదు

    ఇంతకీ మీ రామాయణంలో ఎవరు కనిపిస్తారు? రాముడా, రావణుడా? అంటే...నేను చెప్పే విషయం రాముడి గురించో సీత గురించో కాదు. ఇష్టపడడం, మోహించడం తప్పు కాదు. కానీ అది తప్పని తెలిసి ‘అరె.. ఇలా చేయకూడదు' అనుకొని వెనక్కి తిరగగలిగే ధైర్యం ఉండాలి. ‘మన వూరి రామాయణం'లోనూ అలాంటి సంఘటనల సమాహారం కనిపిస్తుంది.

    English summary
    Prakash Raj has landed in controversy after walking out of an interview with a TV channel after he was asked a question related to the Cauvery water issue involving Tamil Nadu and Karnataka. The video of the actor expressing his anger has now gone viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X