జయ ప్రకాష్ రెడ్డి మరణం.. సొంత మనిషిలా భావించేవారు... ఎన్టీఆర్, అనిల్ రావిపూడి ఎమోషనల్
ప్రస్తుతం భారత చిత్ర గడ్డు పరిస్థితి ఎదుర్కోంటోంది. ఇలాంటి సమయంలో ఎంతో మంది దిగ్గజాలను కోల్పోతోంది. ఇప్పటికే ఈ ఏడాది గొప్పగొప్ప నటులు మరణించారు. తాజాగా విలక్షణ నటుడు జయ ప్రకాష్ రెడ్డి తిరిగి రాని లోకాలు వెళ్లిపోయారు. తెలుగు సినీ చరిత్రలో సరికొత్త విలనిజాన్ని పరిచయం చేసిన జయ ప్రకాష్ రెడ్డి నేటి ఉదయం గుండెపోటుతో మరణించారు. జయ ప్రకాష్ రెడ్డి మృత్యు వార్తను తెలుసుకున్న సినీ ప్రముఖలంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా వీరింతా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
అనిల్ రావిపూడి ఎమోషనల్..
జేపీ గారితో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకం. దాదాపు నా ప్రతీ సినిమాలో ఆయన ఉన్నారు. నన్ను ఆయన సొంత మనిషిలా భావించేవారు. ఎంతో ప్రేమగా పలకరించేవారు. నేను ఆయన్ను కచ్చితంగా మిస్ అవుతాను. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్.. వ్యక్తిగతంగా గానీ నటనలో గానీ మీ లోటు పూడ్చలేనిది సర్ అంటూ అనిల్ రావిపూడి ఎమోషనల్ అయ్యాడు.
గోపీచంద్ మలినేని షాక్..
జయ ప్రకాష్ రెడ్డి గారి మరణ వార్త విని షాక్ అయ్యాను. ఈ విషయం తెలిసి ఎంతో కలత చెందాను. ఎంతో విలక్షణమైన నటుడు మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.. మేమంతా మిమ్మల్ని మిస్ అవుతాము సర్ అంటూ చేతులెత్తి దండం పెట్టాశాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.
జయప్రకాష్ రెడ్డి గారు మరణించారన్న వార్త విని ఎంతో కలత చెందాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ నారా రోహిత్ ట్వీట్ చేశాడు. మరో వైపు వెన్నెల కిషోర్ ఈ వార్త తెలిసి ఎంతో కుమిలిపోయాడు. మాటలు రాక చేతులెత్తి దండం పెట్టేశాడు.

నిర్మాణ సంస్థల సంతాపం..
జయ ప్రకాష్ రెడ్డి మృతి పట్ల ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. నట రత్నాన్ని ఈ ఇండస్ట్రీ కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అని దిల్ రాజ బ్యానర్ వారు ట్వీట్ చేశారు. జయ ప్రకాష్ రెడ్డి గారి మరణ వార్త విని షాక్ అయ్యాం.. ఎంతో ఆవేదనకు లోనయ్యాం.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.
Recommended Video
ఎన్టీఆర్ ట్వీట్..
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. జయ ప్రకాష్ రెడ్డి మరణ వార్త ఎంతో బాధను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. మేమంతా మిమ్మల్ని మిస్ అవుతున్నాం సర్ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











