twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆపాట చూసి కన్నీళ్లు వచ్చేశాయి, తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశాం: "వై దిస్ కొలవరి" అనిరుధ్

    |

    అనిరుధ్ రవిచందర్ ఒక దశలో దేశాన్ని దాటి మరీ యూత్ ని "వై దిస్ కొలవరి డీ అంటూ స్టెప్పులేయించాడు, 3 (త్రీ) సినిమాకోసం హీరో ధనుష్ తో ప్రయోగాత్మకంగా పాడించిన ఆ పాట ఎంతటి సంచలనం అయ్యిందో చెప్పాల్సిన పనే లేదు. అప్పటికి అనిరుధ్ ఇరవయ్యేళ్ళు కూడా లేని ఒక టీనేజర్ మాత్రమే. సినిమాలకి మ్యూజిక్ చేయటం అన్న ఆలోచనకూడా పెద్దగా లేని సమయం లో ఈ కుర్రాడు సరదాగా చేయించిన ఆ పాట ఆన్ లైన్ లో ఒక సునామీ అయ్యింది. ఆ పాటకు సంబంధించిన బ్యాగ్రౌండ్ స్టోరీని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు అనిరుధ్. దీంతో పాటు తన సంగీత ప్రస్థానం గురించి.. తెలుగులో ఎంట్రీ గురించి కూడా మాట్లాడాడు.

     మూడేళ్ల వయసులో ఉండగానే

    మూడేళ్ల వయసులో ఉండగానే

    ‘నేను మూడేళ్ల వయసులో ఉండగానే పియానో పట్టాను. తర్వాత పెరిగే కొద్దీ అనేక రకాల సంగీత పరికరాలతో సాధన చేశాను. స్కూల్లో ఉండగా క్లాసులు అవ్వగానే సంగీతం మీదే నా దృష్టి ఉండేది. రకరకాల బ్యాండ్లతో స్కూల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాడిని. నేను కాలేజీలో చేరిన రెండో సంవత్సరంలో నాకు ‘3' సినిమాకు పని చేసే అవకాశం లభించింది.

    నేను చేయలేనన్నాను

    నేను చేయలేనన్నాను

    ఐతే నేను చేయలేనన్నాను. ట్యూన్స్ ఇవ్వగలనన్న నమ్మకముంది కానీ.. సినిమాలకు మ్యూజిక్ చేసే ప్రాసెస్ ఏంటన్నది తెలియదు. కాబట్టి నేను రెడీగా లేనన్నాను. కానీ ధనుష్ వాళ్లు పట్టుబట్టి చేయించారు. ‘3' సినిమాకు 10 పాటలు రెడీ చేశాను. ఐతే ఆ ఏడాది నా పుట్టిన రోజు నాడు హైదరాబాద్ లో ఉండగా.. ‘కొలవెరి' పాట లీక్ అయినట్లు సమాచారం వచ్చింది.

    అది చూసి కన్నీళ్లు వచ్చేశాయి

    అది చూసి కన్నీళ్లు వచ్చేశాయి

    ఆన్ లైన్లో చూస్తే అది రఫ్ గా చేసిన పాట. అది చూసి కన్నీళ్లు వచ్చేశాయి. ఎంతో కష్టపడి తొలి సినిమా చేస్తుంటే ఇలా పాట లీక్ అవడం.. అది కూడా ఒరిజినల్ సాంగ్ కాకపోవడం నిరాశ కలిగించింది. దీంతో పాటలన్నింటినీ రిలీజ్ చేసేయాలనుకున్నాం. కానీ మేం అడిగిన టైంలోపు సీడీలు వేసి ఇవ్వడం కుదరదన్నారు. దీంతో యూట్యూబ్ లో పాట లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాం.

     తప్పనిసరి పరిస్థితుల్లో

    తప్పనిసరి పరిస్థితుల్లో

    అప్పటికది చాలా కొత్త. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. అలా సంచలన రీతిలో నేను సంగీత దర్శకుడిగా లాంచ్ అయ్యా. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ గారి సినిమాతోనూ అలాంటి అరంగేట్రమే లభిస్తుందని అనుకుంటున్నా'' అని అనిరుధ్ అన్నాడు.

    English summary
    Young Music Director Anirudh Ravindran Reveals about Kolaveri D Song Leak Story from 3 Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X