»   » పెళ్లి గురించి హీరోయిన్ అంజలి ఇలా అందేంటి?

పెళ్లి గురించి హీరోయిన్ అంజలి ఇలా అందేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో పలు సినిమాలు, వివాదాలతో హీరోయిన్ అంజలికి గుర్తింపు బానే వచ్చింది. త్వరలో 30వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న అంజలి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వడానికి ప్రయత్నిస్తుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలు విని ఆమె షాకైంది. తనకు అసలు ఇపుడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేసింది.

ఈ విషయమై అంజలి మాట్లాడుతూ...‘పెళ్లి చేసుకోవాలనే తొందర నాకు ఇప్పుడేమీ లేదు. నా లక్ష్యం సినిమా రంగంలో రాణించడమే. సమయం వచ్చినపుడు పెళ్లి చేసుకుంటాను. అది ఎప్పుడు అనేది నేనే స్వయంగా వెల్లడిస్తాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. ప్రస్తుతం నేను మూడు లాంగ్వేజెస్ లో నటిస్తూ బిజిగా ఉన్నాను' అని చెప్పింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Anjali about Wedding

తమిళ చిత్ర సీమలో మంచి ఫాంలో ఉన్న సమయంలో హీరోయిన్ అంజలి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తన పిన్ని, తమిళ దర్శకుడు కళంజియంతో గొడవల కారణంగా అప్పట్లో ఆమెను కోర్టు కేసులు చుట్టుముట్టాయి. ఆ గొడవల కారణంగా ఆమె తమిళ చిత్ర సీమకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఈ గొడవలేమీ లేకుంటే ఇప్పటికీ ఆమె అక్కడ స్టార్ హీరోయిన్ అయ్యేది. తమిళ సినీ పరిశ్రమకు కొంత కాలం దూరం అయినా తెలుగులో ఆమె మంచి అవకాశాలే దక్కించుకుంది. అంజలి ఇపుడు మళ్లీ తమిళ చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

‘అప్ప మక్కరు' అనే సినిమాతో పాటు ‘మాప్పిల సింగం' అనే చిత్రంలో నటిస్తోంది. అప్ప మక్కరు చిత్రంలో జయం రవి హీరో. సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాప్పిల సింగం చిత్రంలో విమల్ హీరోగా చేస్తున్నాడు. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాప్పిల సింగం చిత్రంలో అంజలి లాయర్ పాత్రలో నటిస్తోంది.

ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఆమె లాయర్ లుక్ విడుదల చేసారు. ఆ మధ్య కేసులతో సతమంతం అయిన అంజలి....ఇపుడు లాయర్ పాత్రలో నటిస్తుండటం గమనార్హం. దీంతో పాటు కన్నడలో ధీర రణవిక్రమ చిత్రంలో నటిస్తోంది. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయి కానీ గీతాంజలి తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు ఫైనల్ కాలేదు.

Read more about: anjali, అంజలి
English summary
Tamil Actress Anjali has once again clarified on rumours about her marriage. "I am in no hurry to enter wedlock. Acting is my sole priority now, I will tie the knot at appropriate time. And when I do so, I will make an open announcement. There will be no secrets. I am currently acting in movies in three languages" actress says.
Please Wait while comments are loading...