twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మనందంతో అంజలి క్రేజీ ప్రాజెక్ట్.. పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్..

    |

    ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో నటించనుంది ఆ చిత్రమే "లిసా'. పీజీ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాత మరియుసినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్,మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి'ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు తమ అనుభవాలు పంచుకున్నారు.

    త్రీడీ టెక్నాలజీలో లిసా

    త్రీడీ టెక్నాలజీలో లిసా

    మొదటగా "లిసా' చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ... ‘‘100 రోజులు పైగా ఈ షూటింగ్ జరిగింది. షూటింగ్ సెట్‌లో ఎన్నో మంచి అనుభూతులు పొందాను. ఒక సినిమా షూటింగ్ చెయ్యడం అంటే కష్టమైన పని అని చెప్పాల్సిన అవసరం లేదు. అదీ త్రీడీలో అయితే ఇంకా కష్టమైనా పని. కానీ పీజీ ముత్తయ్య గారి ఫ్రేమ్స్ మరియు ఆయన కష్టం వల్ల శరవేగంగా పూర్తయ్యింది. ముత్తయ్య గారి టైం, కష్టం మా కోసం వెచ్చించినందుకు ఆయనకు నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. అంజలి గారు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. టైటిల్ రోల్‌లో ఆమె ఆ పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి అని అన్నారు.

    ప్రత్యేక పాత్రలో బ్రహ్మానందం

    ప్రత్యేక పాత్రలో బ్రహ్మానందం

    నటుడు సామ్ జోన్స్ ఇందులో మంచి పాత్ర చేశారు. చాలా మంచి నటుడు. ఇక మకరంద్‌దేశ్ పాండే గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వావ్... అతని యాక్టింగ్ స్కిల్స్ చూసి సెట్‌లో అందరు ఇలాగే ఆశ్చర్యపోయారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో బ్రహ్మానందం గారు నటిస్తున్నారు. ఆయనకు పద్మశ్రీ, గిన్నీస్ రికార్డు వంటి ఎన్నో అవార్డులు ఉన్నా ఎప్పుడూ సింపుల్‌గా నవ్విస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని రాజు విశ్వనాథ్ పేర్కొన్నారు.

    అందరికీ థ్యాంక్స్

    అందరికీ థ్యాంక్స్

    నటి సలీమా గారు రెండు దశాబ్దాల క్రితం తెలుగు, కన్నడలో హీరోయిన్‌‌గా చేశారు. నేను ఆమెను అప్రోచ్ అయ్యి ఈ చిత్రంలో నటించమని అడగ్గానే వెంటనే ఒప్పుకున్నందుకు ఆవిడకు నా థ్యాంక్స్. ఇక మైమ్ గోపీకు ఐ లవ్ యు. ఇంతకంటే ఎక్కువ ఆయన గురుంచి చెప్పలేను. సబితా రాయ్, సురేఖ వాణి, చాలా మంచి యాక్టర్స్. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇందులో కళ్యాణి నటరాజన్ అంజలికి తల్లిగా నటించారు. తన న్యాచురల్ యాక్టింగ్‌తో అందరిని ఆమె ఆశ్చర్యపరిచారు. జబర్దస్త్ ఫణి, అవినాష్. జీఎంఆర్ కామెడీ పాత్రల్లో నటించారు. వారందరికీ చాలా థ్యాంక్స్ అని రాజు విశ్వనాథ్ అన్నారు.

    తొలిసారి 3డీ చిత్రంలో నటిస్తున్నా

    తొలిసారి 3డీ చిత్రంలో నటిస్తున్నా

    హీరోయిన్ అంజలి మాట్లాడుతూ... ‘‘మొదటి సారి 3డీ చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజుకు స్క్రిప్ట్ పై మంచి క్లారిటీ ఉంది.. ఏదైతే చెప్పారో అదే తీశారు. ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. నిర్మాత మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌ను ప్రెజెంట్ చేస్తున్న ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా నన్ను చూపించడమే కాకుండా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మించారు. సంతోష్ అందించిన బాణీలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇలాంటి మంచి ప్రొడక్షన్‌లో పని చేయడం కంఫర్ట్‌గా, హ్యాపీగా ఉంది.'' అన్నారు.

    నిర్మాత, సినిమాటోగ్రాఫర్‌గానూ

    నిర్మాత, సినిమాటోగ్రాఫర్‌గానూ

    నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ... ‘‘లిసా చిత్రానికి నేను నిర్మాణ బాధ్యతతో పాటుగా సినిమాటోగ్రఫర్‌గా కూడా వ్యవహరిస్తూన్నాను. అంజలి గారి నటన అద్భుతం అని చెప్పాలి. కెమెరా వర్క్ చాలా బాగా వచ్చింది. తాజాగా అంజలి పోస్టర్‌తో కూడిన ‘లిసా' పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ విడుదల చేశారు. అందుకు పూరీ జగన్నాధ్ గారికి మా చిత్ర యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

    స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ మూవీగా

    స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ మూవీగా

    ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ మూవీగా ఈ సినిమాను హీలియం 8కే కెమెరాతో చిత్రీకరించాం. ఈ సినిమాను ఈ డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికీ మా లిసా చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆడియో, ట్రైలర్‌లను విడుదల చేసి సినిమాను కూడా అతి త్వరలో విడుదల చేస్తాం అని నిర్మాత ముత్తయ్య అన్నారు.

    ప్రేక్షకులను ఆకర్షించే విధంగా

    ప్రేక్షకులను ఆకర్షించే విధంగా

    మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ దయానిధి మాట్లాడుతూ... ‘‘ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం కలిపించినందుకు దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. అద్భుతమైన ఆర్‌ఆర్‌తో పాటు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి అని ఖచ్చితంగా చెప్పగలను.'' అన్నారు.

    సాంకేతిక వర్గం

    సాంకేతిక వర్గం

    ఈ చిత్రానికి నిర్మాత మరియు సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్,మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి'ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,అసోసియేట్ కెమెరామెన్: శ్రీకాంత్,స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,కోరియోగ్రఫీ: సురేష్,ఆర్ట్ డైరెక్టర్: వినోద్,స్టిల్స్: రవీంద్రన్,కో డైరెక్టర్: జి డి రమేష్ కుమార్,అసిస్టెంట్స్: ప్రకాష్, సుదీష్, నిక్సన్, రావనన్,ప్రొడక్షన్ మేనేజర్స్:బాల మురుగన్, చిన్న రావు, మహేష్,మేనేజర్స్ : రవిచంద్రన్, అరుణ్ మరియు సలీం'క్రియేటివ్ హెడ్ : యోగేష్ కృష్ణ.

    English summary
    The most awaited bilingual 3D film starring Anjali, Brammanandham, Makrand deshpande "LISAA" shooting was wrapped up recently in Hyderabad... After Director Shankar's 2.O, this is yet another feature film shot with the same stereoscopic technology... After the completion of the movie the debutant director RAJU VISWANATH says, It was an nice experience not only for me but also to the entire crew.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X