»   » హీరోయిన్ అంజలి హాట్ లుక్ అదిరింది (ఫోటోలు)

హీరోయిన్ అంజలి హాట్ లుక్ అదిరింది (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అంజలి కధానాయికగా తెలుగులో 'గీతాంజలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందు. హర్రర్, హాస్య కధాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం‌వి‌వి సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ సమకూర్చారు.

'అనుష్కకు 'అరుంధతి'లా, జ్యోతికకు 'చంద్రముఖి'లాగా అంజలి కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచే సినిమా ఇదని అంటున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కథా కథనాలు ఉంటాయి. వినోదానికి ప్రాధాన్యముంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్‌ కామెడీ చిత్రాల్లోనే ఇదొక స్పెషల్‌ మూవీగా నిలిచిపోతుందని రచయిత కోన వెంకట్ చెబుతున్నారు.ఈ చిత్రంలో బ్రహ్మానందం చాలా స్పెషల్‌గా ఉండనుందట.

జూన్‌ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్‌ రాణే అతిథి పాత్ర చేస్తున్నారు. బ్రహ్మానందం, రావు రమేష్‌, మధునందన్‌, షకలక శంకర్‌, సత్యం రాజేశ్‌, తదితరులు ఇందులో ముఖ్యతారలు.

కోన వెంకట్ మాట్లాడుతూ...

కోన వెంకట్ మాట్లాడుతూ...


ఈ చిత్రం కథ పరంగా అద్భుతంగా ఉంటుందని, చిత్రంలో నటి అంజలి పోషించే పాత్ర తెలుగుప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందని కోన వెంకట్ తెలిపారు.

సంగీతం, కెమెరా...

సంగీతం, కెమెరా...


చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందిస్తుండగా, సాయి శ్రీరామ్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

ఇతర ముఖ్య పాత్రల్లో

ఇతర ముఖ్య పాత్రల్లో


చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేశ్, శ్రీనివాస రెడ్డి, మధు నందన్ తదితరులు నటిస్తున్నారు.

అంజలి

అంజలి


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా చిత్రాల అనంతరం నటి అంజలి తెలుగుచిత్రాలలో నటించలేదు. వాటి తర్వాత అంజలి నటించే చిత్రం ఇదే...

ఇపుడు ఆచిత్రాలపై ఆసక్తి

ఇపుడు ఆచిత్రాలపై ఆసక్తి

మారుతి సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్‌తో హార‌ర్‌, కామెడీ జోన‌ర్‌కు తెలుగులో ఆద‌ర‌ణ పెరిగింది. ఈ త‌ర‌హా చిత్రాలు ఇప్పుడు మ‌రిన్ని రూపుదిద్దుకోనున్నాయి. అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా కూడా ఇలాంటి క‌థేన‌ట‌. ఈ సినిమాలో భ‌యం + వినోదం రెండింటినీ మేళ‌వించిన తీరు ఆక‌ట్టుకొంటుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రం స‌రికొత్త అనుభూతినిస్తుంది.. అని కోన వెంక‌ట్ చెబుతున్నారు.

English summary

 South Indian actress Anjali, who was last seen in Venkatesh-Ram's Masala, was out of action for a few months following her controversial disappearance. The Seethamma Vakitlo Sirimalle Chettu star is all set to make her comeback with the movie Geethanjali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu