»   » నన్ను ఇంకా అతడి ప్రియురాలిగా చూడొద్దు: మీడియా తీరుపై నటి ఫైర్

నన్ను ఇంకా అతడి ప్రియురాలిగా చూడొద్దు: మీడియా తీరుపై నటి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గతంలో 'పవిత్ర రిష్తా' అనే టీవీ సీరియల్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే హిందీ బుల్లితెర నటి అంకిత లోఖండేతో ప్రేమాయణం సాగించాడు. అతడికి బాలీవుడ్లో హీరోగా అవకాశం దక్కిన తర్వాత ఇద్దరూ విడిపోయారు.

త్వరలో అంకిత కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న 'మణికర్ణిక' చిత్రంలో అంకిత నటిస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రెస్ మీట్లో తనను ఇంకా సుశాంత్ ప్రియురాలుగా వ్యాఖ్యానించడంపై అంకిత ఫైర్ అయింది.

నన్ను అలా చూడొద్దు

నన్ను అలా చూడొద్దు

నన్ను కొందరు ఇంకా సుశాంత్ గర్ల్ ఫ్రెండుగా చూస్తున్నారు. ఈ విషయంలో మీడియా వారు తమ తీరు మార్చుకుంటారని ఆశిస్తున్నాను. తాను నటిస్తున్న హిందీ సీరియల్స్, సినిమాల గురించి ఎందుకు ప్రస్తావించరని ఆమె ప్రశ్నించారు.

ఖరాకండిగా చెప్పేసిన అంకిత

ఖరాకండిగా చెప్పేసిన అంకిత

ప్రస్తుతం తాను తొలిసారిగా బాలీవుడ్ చిత్రంలో నటించానని, ఇకపై, ఈ విషయం గురించే అందరూ మాట్లాడతారని తాను ఆశిస్తున్నాను.... అనవసర విషయాలు మీడియా వారు తన ముందు ప్రస్తావించకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చింది.

సుశాంత్ స్పందన

సుశాంత్ స్పందన

అంకిత బాలీవుడ్ తెరంగ్రేటంపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్పందించారు. అంకిత బెస్ట్ పెర్ఫార్మెర్ అని.... బాలీవుడ్లో ఆమె సక్సెస్ సాధించి విజయపథంలో సాగాలని కోరుకుంటున్నట్లు.... తన మాజీ ప్రేయసి గురించి వ్యాఖ్యానించాడు.

హీరోగా సక్సెస్

హీరోగా సక్సెస్

ధోని సినిమాతో బాలీవుడ్లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్... తర్వాత ‘రబ్తా' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం చందమామ దూర్ కె అనే చిత్రం చేస్తున్నాడు.

English summary
TV actress Ankita Lokhande of the 'Pavitra Rishta' fame is all set to make a smashing debut on the big screen. She will be joining Kangana Ranaut in Manikarnika: The Queen of Jhansi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu