»   » 'విశ్వరూపం'-2 కి కమల్ చేసిన పెద్ద మార్పు

'విశ్వరూపం'-2 కి కమల్ చేసిన పెద్ద మార్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా సీక్వెల్ అంటే మొదటి చిత్రం కొనసాగింపు...అలాగే ఆ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు,సాంకేతిక నిపుణులు పనిచేస్తూంటారు. అయితే కమల్ రూటే వేరు. 'విశ్వరూపం'-2 సాంకేతిక బృందంలో కొందర్ని మార్చారు.

తొలి భాగానికి సానూ నర్గీస్‌ ఛాయాగ్రాహకుడిగా పని చేశారు. ఆయన సీక్వెల్‌కి అందుబాటులో లేకపోవడంతో శామ్‌దత్‌ని ఎంపిక చేసుకొన్నారు కమల్‌. తెలుగులో 'ప్రస్థానం', 'సాహసం' లాంటి చిత్రాలకి ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు శామ్‌దత్‌.

అలాగే సంగీత దర్శకుడిగా తమిళ చిత్రసీమకు చెందిన గిర్బన్‌కి అవకాశమిచ్చారు. తొలి భాగానికి శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ త్రయం స్వరాలు అందించింది. ఇటీవల గిర్బన్‌ తమిళంలో చేసిన కొన్ని చిత్రాలు కమల్‌కి నచ్చాయి. దాంతో 'విశ్వరూపం 2' స్వరాల బాధ్యతను ఆయనకు అప్పగించారు.


కమల్‌హాసన్‌ రెండోసారి విశ్వరూపం చూపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'విశ్వరూపం'. ఆ చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. ఇప్పుడు విశ్వరూపం-2ని తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు కమల్‌. ఆగస్టులో ఈ చిత్రం తెరపైకి వస్తుంది.

'విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

English summary
Very recently, for reasons unknown, cinematographer Sanu Varghese was replaced by Shambat Sainudeen for the much awaited sequel of Vishwaroopam. Now we have received information about another big change. Shankar-Eshaan-Loy, who gave Vishwaroopam spectacular numbers, will not be working in the sequel, it seems. Our inside sources have indeed confirmed that the young composer, Ghibran will be working with Kamal for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu