»   »  పవర్‌ఫుల్‌గా జగ్గుభాయ్.. 400 మందితో పాట.. బోయపాటి భారీ సినిమా

పవర్‌ఫుల్‌గా జగ్గుభాయ్.. 400 మందితో పాట.. బోయపాటి భారీ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెరమీద హీరోనైనా, విలన్‌నైనా పవర్‌ఫుల్‌గా చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుది ప్రత్యేకమైన శైలి. సరైనోడు రికార్డు హిట్ తర్వాత బెల్లంకొండ శ్రీనుతో బోయపాటి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు కోసం ప్రత్యేకంగా ఓ పవర్‌ఫుల్ పాత్రను బోయపాటి డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతున్నది. ఈ చిత్రంలో అందాల భామలు రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

బ్యాంకాక్ చేరిన రకుల్ ప్రీత్

బ్యాంకాక్ చేరిన రకుల్ ప్రీత్

ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గోనేందుకు రకుల్ ఇటీవల బ్యాంకాక్ వెళ్లింది. తాను బ్యాంకాక్‌కు చేరినట్టు ట్వీట్టర్‌లో ఫొటోను పోస్ట్ చేసింది రకుల్. త్వరలోనే స్టైలిష్ట్ నీరజ కోన కూడా జత కలువనున్నదని తెలిపింది. 400 మందితో తెరకెక్కించనున్న పాటలో నటించేందుకు సిద్ధమవుతున్నది.

 లెజెండ్.. శ్రీమంతుడుకు మించిన పాత్రలో జగ్గుభాయ్

లెజెండ్.. శ్రీమంతుడుకు మించిన పాత్రలో జగ్గుభాయ్


లెజెండ్ చిత్రంలో జగపతిబాబు పాత్ర ఆ చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. నందమూరి బాలయ్యకు పోటాపోటిగా నటించి తెరపై రక్తికట్టించారు. హీరోగానే కాకుండా విలన్‌గా తనకు ఎదురులేదని సంకేతాలు పంపాడు జగ్గుభాయ్. ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. మన్యం పులిలోనూ తనదైన విలనిజంతో దక్షిణాదిని ఆలరించాడు.

 మరో పవర్‌ఫుల్ పాత్రలో జగపతిబాబు

మరో పవర్‌ఫుల్ పాత్రలో జగపతిబాబు


తాజాగా బెల్లంకొండ శ్రీనుతో నిర్మిస్తున్న చిత్రంలో జగపతిబాబు కోసం ఓ పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం. జగపతి బాబుని గత చిత్రాల కంటే పవర్‌ఫుల్ గా బోయపాటి చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ చిత్రంలోని పాత్ర జగపతి స్థాయిని మరింత పెంచే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు.

 400 మందితో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ

400 మందితో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ


బోయపాటి శ్రీనుకు ఓ భారీ హిట్‌ను ఇచ్చేందుకు తీస్తున్న ఈ చిత్రం లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నది. ఈ సినిమా కోసం ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరించాలని బోయపాటి నిర్ణయించాడు. దాదాపు 400 మంది డాన్సర్స్ ఈ పాటలో పాల్గొననున్నట్టు సమాచారం. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బోయపాటి చేస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

English summary
After legend movie director Boyapati srinu is designed a powerful role in latest bandla Ganesh movie. In this movie Rakul Preet singh and Pragya Jaiswal are heroines. Now this movie shooting at bangkok.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu