twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    14 ఏళ్ల వయసులో.. మ్యూజిక్ డైరెక్టర్ పడక గదిలోకి రమ్మన్నాడు..

    By Rajababu
    |

    సినీ పరిశ్రమలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ఒకటి ఉంది. అదేమిటంటే.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దామనుకొంటాం. కానీ మేము రమ్మనే చోటికి మీరు రారు అని ఓ చిత్రంలో ఓ సంగీత దర్శకుడు అనడం బాగా ప్రేక్షకులకు ఎక్కింది. అలాంటి తెరపైనే కాదు.. తెర వెనుక బాగోతాలు ఉంటాయనే తాజాగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

    Recommended Video

    Anchor Rashmi Gautham Sungs Populer Mass Song రష్మీ.. క్లాస్ కాదు మాసే..

    ప్రముఖ దర్శకుడు హర్వే వీన్‌స్టెయిన్ పైత్యం సినీ వర్గాలను నివ్వెరపాటుకు గురిచేస్తున్నది. తాజాగా ఇలాంటి వ్యవహారాన్ని ప్రఖ్యాత సంగీత దర్శకుడు పండిట్ రవి శంకర్ కుమార్తె అనౌష్క శంకర్ బయటపెట్టింది. తాను లైంగిక వేధింపులకు గురైనట్టు వెల్లడించింది. ఆమె ఏమన్నారంటే..

     14 ఏళ్ల వయసులో వేధింపులు

    14 ఏళ్ల వయసులో వేధింపులు

    నాకు అప్పుడు 14 ఏళ్లు. నా పడకగదిలోకి వస్తావా అని ఓ మ్యూజిక్ డైరెక్టర్ అడిగాడు. అప్పుడే అతడి ముఖం మీద చాచి కొట్టాలనిపించింది. అవకాశాల కోసం తాను అలాంటి చీప్ వ్యవహారాలకు లొంగను అని చెప్పినట్టు అనౌష్క వెల్లడించింది.

    లైంగిక వేధింపులు ఓ షాక్

    లైంగిక వేధింపులు ఓ షాక్

    బాలలపై లైంగిక వేధింపులపై అనౌష్క శంకర్ ధైర్యంగా స్పందించింది. ఓ వీడియో ఆల్బమ్‌ను కూడా నాలుగేళ్ల క్రితం రూపొందించింది. అలాంటి వీడియోను మరెవరూ రూపొందించలేదనుకొంటాను. బాలలపై వేధింపులు నిజంగా షాక్ గురిచేస్తుంది.

     ఇంకా వెంటాడతున్న చేదు అనుభవాలు

    ఇంకా వెంటాడతున్న చేదు అనుభవాలు

    నాకు ఎదురైన అనుభవాలు ఇప్పటికి వెంటాడుతుంటాయి. నేను 7 సంవత్సరాల వయస్సు నుంచే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. 8, 9, 10, 11, 12, 13, 14, 17, 28 ఏళ్ల వయసులో లండన్, లాస్ వెగాస్, న్యూఢిల్లీ, కాలిఫోర్నియా, ఫ్రాన్స్, న్యూయార్క్‌లో లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ #metoo అని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.

    దారుణాలపై పోరాటం చేయాలి

    దారుణాలపై పోరాటం చేయాలి

    ఇలాంటి దారుణాలకు మంగళం పాడటానికి ప్రతి ఒక్కరు పోరాడాలి. అలాంటి దుష్టులను ఏరిపారేయాలి. చీకటి మాటున సాగుతున్న ఈ దారుణాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని అనౌష్క చెప్పారు.

    అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి

    అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి

    కేవలం సినీ పరిశ్రమలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మ్యూజిక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరితో కలిసి పనిచేశాను. వివిధ జనరేషన్ల వారిని కలిశాను. నా తండ్రి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కావడం వల్ల నాకు లైంగిక వేధింపులు పెద్దగా ఎదురుకాలేదు. కొన్నింటిని సమర్ధంగా ఎదుర్కొన్నాను అని అనౌష్క వెల్లడించారు.

     షిరాజ్ ప్రమోషన్‌లో అనౌష్క

    షిరాజ్ ప్రమోషన్‌లో అనౌష్క

    లండన్‌లో నివసించే అనౌష్క శంకర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నది. 1928లో వచ్చిన షిరాజ్: రొమాన్స్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని రీమేక్ చేసింది. ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బ్రిటీష్ కౌన్సిల్ అండ్ బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నది. ఈ చిత్రానికి తొలిసారి పూర్తిస్థాయిలో సంగీతాన్ని అనౌష్క శంకర్ అందించడం విశేషం.

    English summary
    As sexual assault allegations mount against Hollywood producer Harvey Weinstein and the #metoo campaign blows the lid off violence against women, renowned sitar player Anoushka Shankar, daughter of Pandit Ravi Shankar, says that she was targeted, too. Anoushka Shankar, the renowned sitar player, to say, “Me, too.” and told “When I was 14, I had a musician ask me if I could go up to his room…,”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X