For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఆచార్య’కు బిగ్ షాక్: మెగా హీరోల సినిమాలను ఆపేయాలని ఏటీఎఫ్ ఫిర్యాదు.. రానాకూ తప్పని చిక్కులు

  |

  మిగిలిన వాటితో పోలిస్తే సినీ రంగంలోనే ఎక్కువగా వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఎన్నో కారణాల వల్ల చాలా చిత్రాలకు చిక్కులు ఎదురవుతుంటాయి. పలానా పాటను కాపీ కొట్టారనో.. కథను అక్రమంగా తీసుకున్నారనో.. అనుమతులు లేకుండా వాడుకున్నారనో.. లేక ఓ వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా సినిమాలు రూపొందించారనో.. ఇలా ఎన్నో రకాలుగా సినిమాలకు ఆటంకాలు వస్తుంటాయి. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'తో పాటు దగ్గుబాటి రానా చిత్రం 'విరాట పర్వం'కు కొత్త చిక్కులు వచ్చాయి. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  ‘ఆచార్య'గా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి

  ‘ఆచార్య'గా వస్తున్న మెగాస్టార్ చిరంజీవి

  టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రమే ‘ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి.

   అతడి రాకతో మెగా మల్టీస్టారర్‌గా మార్పు

  అతడి రాకతో మెగా మల్టీస్టారర్‌గా మార్పు

  ‘ఆచార్య'లో రామ్ చరణ్‌తో పూర్తి స్థాయి పాత్రను చేయిస్తున్నాడు చిరంజీవి. అందుకోసం స్క్రిప్టును మార్చి రాయించాడు. ఇందులో ‘సిద్ధ' అనే పాత్రను చేస్తున్న మెగా పవర్ స్టార్.. దాదాపు 30 నిమిషాల వరకూ కనిపిస్తాడట. ఇక, అతడి ఎంట్రీతో ఈ మూవీ మెగా మల్టీస్టారర్‌గా మారిపోయింది. ఇక, ఇందులో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఈ పోస్టర్ కూడా వచ్చింది.

   విప్లవాత్మకమైన కథతో వస్తున్న రానా

  విప్లవాత్మకమైన కథతో వస్తున్న రానా

  టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం'. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల రూపొందిస్తున్నాడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమ కథగా వస్తున్న దీనిలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తోన్నాడు.

  కామన్ పాయింట్.. రిలీజ్ డేట్లు ప్రకటన

  కామన్ పాయింట్.. రిలీజ్ డేట్లు ప్రకటన

  అటు ‘ఆచార్య'.. ఇటు ‘విరాట పర్వం' సినిమాలు ఒకే కామన్ పాయింట్‌తో తెరకెక్కుతున్నాయి. అదే.. ఈ రెండు చిత్రాలు నక్సలైట్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్నవే. అందుకే ఇవి ప్రత్యేకమైనవిగా నిలుస్తున్నాయి. దగ్గుబాటి రానా విరాట పర్వం మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిరంజీవి - చరణ్ నటిస్తోన్న ఆచార్య మాత్రం మే 13న విడుదల అవబోతుంది.

   చిత్రాలను ఆపేయాలని ఏటీఎఫ్ ఫిర్యాదు

  చిత్రాలను ఆపేయాలని ఏటీఎఫ్ ఫిర్యాదు


  కొన్ని రకాల సినిమాలకు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఇవి సెన్సార్ బోర్డు వల్ల కావొచ్చు.. కొన్ని సంస్థల వల్ల కావొచ్చు. గతంలో ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్‌కు ముందు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ‘యాంటీ టెర్రరిజం ఫోరమ్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆచార్య', ‘విరాట పర్వం' సహా కొన్నిచిత్రాలపై సెన్సార్‌కు ఫిర్యాదు చేశాయి.

  Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
  ఆ రెండు చిత్రాలకే చిక్కులు వచ్చాయి

  ఆ రెండు చిత్రాలకే చిక్కులు వచ్చాయి

  నాలుగు రోజుల క్రితం చత్తీష్‌గడ్‌లో మావోయిస్టులు మారనకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్సలైట్/మావోయిస్టులకు అనుకూలంగా ఉన్న ‘ఆచార్య', ‘విరాట పర్వం' సినిమాలకు అనుమతి ఇవ్వవద్దని చెబుతూ యాంటీ టెర్రరిజం ఫోరమ్ తాజాగా సెన్సార్ బోర్డుకు విన్నవించింది. అలాగే, భవిష్యత్‌లోనూ అలాంటి సినిమాలను ప్రోత్సహించొద్దని కోరింది.

  English summary
  Chiranjeevi’s Acharya and Virata Parvam are two films that have Naxalite set up as the backdrop. Now, things have changed a bit in the last day or so with some danger lurking in these films. The update is that the Anti-Terrorism Forum met the Censor Board asking to not issue censor clearance for movies that are sympathetic to Maoists.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X