అను ఇమ్మాన్యుయేల్ అడిగిన ఒకే ఒక్క కోరిక నెరవేర్చిన బన్నీ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య. బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం దేశభక్తి కథాంశంగా రూపొందుతోంది. రచయిత వక్కంతం వంశి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కొత్త గెటప్ ఆకట్టుకుంటోంది. యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అను నటించిన అజ్ఞాతవాసి చిత్రం నిరాశపరచడంతో ఈమె నా పేరు సూర్య చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉంది.
దేశభక్తి ప్రధాన నేపథ్యంలో అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాత. కాగా ఈ చిత్రం బుధవారం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మే 4 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో వరుస విజయాలు దక్కించుకుంటున్నాడు. నా పేరు సూర్య చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
షూటింగ్ చివరి రోజు సందర్భంగా అల్లు అర్జున్ ని అను ఇమ్మాన్యుయేల్ ఒకే ఒక్క కోరిక కోరిందట. ఓ సెల్ఫీ కావాలని బన్నీని అను కోరిందట. తన క్యూట్ హీరోయిన్ కోరిక కోరడంతో బన్నీ కాదనలేకపోయాడు. వెంటనే సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











