»   » ఓ వైపు సినిమా ప్లాపు, కోతి అంటూ విమర్శలు... దర్శకుడి స్పందన!

ఓ వైపు సినిమా ప్లాపు, కోతి అంటూ విమర్శలు... దర్శకుడి స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటించిన జగ్గా జాసూస్ సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు దారుణమైన ఫలితం రావడంతో రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ దర్శకుడి మీద ఆ మధ్య తీవ్రంగా ఫైర్ అయ్యారు.

'జగ్గా జాసూస్' సినిమా తీసిన అనురాగ్ బసుతో పాటు అంతకు ముందు తన కొడుకుతో 'బాంబే వెల్వెట్' లాంటి ప్లాపు సినిమా తీసిన అనురాగ్ కశ్యప్ మీద కూడా మండి పడ్డారు. ఆ ఇద్దరు దర్శకులను తండ్రి తిట్టి పోస్తుంటే రణబీర్ కపూర్ మాత్రం ఈ ఇద్దరు దర్శకులను వారి తప్పేమీ లేదంటూ పలు సందర్భాల్లో వెనకేసుకొచ్చారు.

ఇన్నాళ్లు రిషి కపూర్ ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా ఉ న్న అనురాగ్ బసు తాజాగా నోరు విప్పారు.

విమర్శలకు బాధ పడను

విమర్శలకు బాధ పడను

‘విమర్శలకు నేనెప్పుడూ కృంగి పోలేదు. కానీ రణబీర్ కపూర్ మా వైపు నిలిచినందుకు థాంక్స్ చెబుతున్నాను. సినిమా ప్లాపయినా దర్శకులకు సపోర్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా డిఫికల్ట్. రణబీర్ కపూర్ మాకు మద్దతుగా ఉన్నందుకు ఆనందంగా ఉంది' అని అనురాగ్ బసు అన్నారు.

రిషి కపూర్ విమర్శలపై

రిషి కపూర్ విమర్శలపై

‘ఒక సినిమా తీసినపుడు రెండు రకాల ఒపీనియన్స్ వస్తాయి. సినిమా బావుందని కొందరు, బాగోలేదని కొందరు ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ఇలాంటి వాటికి నేనేమీ బాధ పడను. అనురాగ్ బసు, అనురాగ్ కశ్యప్ ఇద్దరూ భిన్నమైన వ్యక్తులని ప్రేక్షకులకు తెలుసు' అని అనురాగ్ బసు చెప్పుకొచ్చారు.

అమితాబ్ మెచ్చుకున్నారు

అమితాబ్ మెచ్చుకున్నారు

‘జగ్గా జాసూస్' సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అపుడు చాలా సంతోషించాను. మంచి కామెంట్స్ స్వీకరించినపుడు, నెగెటివ్ కామెంట్స్ కూడా స్వీకరించాలి' అని అనురాగ్ బసు అన్నారు.

పిల్లలను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా

పిల్లలను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా

జగ్గా జాసూస్ సినిమా అనేది పిల్లలను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా. వాళ్లను ఈ సినిమా ఎంతగానో మెప్పించిందని భావిస్తున్నాను. ఫ్యూచర్లో రణబీర్ కపూర్ తో మరిన్ని సినిమాలు చేస్తాను అని అనురాగ్ బసు చెప్పుకొచ్చారు.

ఇద్దరు డైరెక్టర్లను దారుణంగా ఇన్సల్ట్ చేస్తూ రిషి కపూర్ గతంలో...

ఇద్దరు డైరెక్టర్లను దారుణంగా ఇన్సల్ట్ చేస్తూ రిషి కపూర్ గతంలో...

‘జగ్గా జాసూస్' మూవీ ప్లాప్ టాక్ వచ్చిన వెంటనే రిషి కపూర్ అనురాగ్ బసుతో పాటు, అనురాగ్ కశ్యప్ లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాలకు మాత్రమే వారు సెట్టవుతారు. పెద్ద సినిమాలను హ్యాండిల్ చేయడం వారికి చేతకాదు. అలా చేయడం అంటే కోతి చేతిలో ఖరీదైన బొమ్మ పెట్టడమే.... అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Anurag Basu has responded to Rishi Kapoor's strong criticisms for making a film like Jagga Jasoos starring Ranbir Kapoor. The director thanked Ranbir, son of the veteran actor, for supporting him. However, Basu said that he was not hurt by the criticisms, but thanked Ranbir for standing by him. "It is sweet of Ranbir to say such things. It is difficult to give a statement like that," PTI quoted Basu as saying.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu