»   » చిరంజీవి 150వ సినిమాలో అనుష్క ఖరారు

చిరంజీవి 150వ సినిమాలో అనుష్క ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై చిత్రయూనిట్ కొంతకాలంగా తర్జనభర్జన పడింది. ఎట్టకేలకు అనుష్కను హీరోయిన్ గా ఖరారు చేసారు. మరో హీరోయిన్ కేథరిన్ థెరిస్సా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది.

అనుష్క కంటే ముందు చాలా మందిని పరిశీలించారు. అయితే ఫిజిక్ పరంగా అనుష్క అయితేనే చిరంజీవికి పర్ ఫెక్టుగా సెట్టవుతుంది, పైగా తెలుగులో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటం కూడా సినిమాకు ప్లస్సవుతుంది. అందుకే అనుష్కనే ఫైనల్ చేసారు. ఈ సినిమా కోసం అనుష్క బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

anushka

తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు. చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తాడు. 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' స్థాపించారు.

ప్రస్తుతం చిరంజీవి సినిమాలో పాత్రకు తగిన విధంగా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గేందుకు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మేరకు దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవితో దిగిన సెల్ఫీని పోస్టు చేసాడు. బాస్ చిరంజీవితో 150వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే డిస్క్రషన్స్ మొదలయ్యాయి అంటూ దేవిశ్రీ పేర్కొన్నారు.

English summary
After so many speculations and rumours the heroine for Chiranjeevi 150th film has been finally confirmed. Super star Anushka will be playing the love interest of Chiru in this Tamil remake of Kaththi which was directed by the genius A R Muragadoss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu