»   » రికార్డ్: హీరోయిన్ అనుష్క కోసం కోటి మంది...

రికార్డ్: హీరోయిన్ అనుష్క కోసం కోటి మంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ ముందుగా చెప్పే పేరు అనుష్క శెట్టి. గ్లామర్ పాత్రలతో పాటు వీరోచితమైన పాత్రలు, కామెడీ పండిచే పాత్రలు ఇలా ఎందులో అయినా పర్ ఫెక్టుగా ఒదిగి పోవడం ఆమె ప్రత్యేకత. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, వర్ణ లాంటి సినిమాల్లో అనుష్క అభినయం అద్భుతం.

అందుకే అనుష్కకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా ఆమె ఫేస్ బుక్ పేజీని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కోటి దాటింది. ఈ విషయంలో అనుష్క పలువురు స్టార్ హీరోలను సైతం మించిపోవడం గమనార్హం. ప్రస్తుతం అనుష్క వరుస సినిమాలతో బిజీగా గుపుతోంది. ఆమె నటిస్తున్న బాహుబలి-2 త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరో వైపు ఆమె నటించిన ‘సైజ్ జీరో' మూవీ విడుదలకు సిద్దమవుతోంది.

Anushka has 1cr FB followers

సైజ్ జీరో...
ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మించిన చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది.

‘సైజ్' జీరో చిత్రం ఆడియో నవంబర్ 1న విడుదల విడుదలైంది. అదే సందర్భంలో థియేట్రికల్ ట్రైలర్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ చిత్ర కథాంశం ప్రకారం అనుష్క భారీ లుక్ తో కనపడనుంది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌,బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌, సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డ్యాన్స్‌: రాజుసుందరం,బృంద, ఫిరోజ్‌ఖాన్‌, కాస్ట్యూమ్స్‌: ప్రశాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి.

English summary
Sweethy Anushka Shetty's Facebook is getting flooded with numerous followers and likes. Now she has 1cr FB followers.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu