For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కుర్రాళ్ళకి మాత్రమే: క్రిర్రు ఎక్కించే కోక... కైపక్కిస్తున్న పాప... అనుష్క

  By Srikanya
  |

  హైదరాబాద్: అరుంధతి చిత్రంలో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న అనుష్క తాజాగా మిర్చి సినిమాలో మరో సారి అందరి ప్రసంసలు పొందింది. అంతేగాక తను వయస్సు పెరుగుతున్నా తన అందచందాలకు మాత్రం ఏజ్ ఎఫెక్టు లేదన్నట్లు ఫోటో షూట్ చేసి మరీ హాట్ గా విడుదల చేసింది.

  సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్న అనుష్క ఆ మధ్య తెలుగులో పనైంపోయిందంటూ వార్తలు వచ్చాయి. వరసగా చేస్తున్న తమిళ సినిమాలే ఆమెకు దిక్కని, ఇక్కడ కెరీర్ దాదాపు అంతమైనట్లే అని వినిపించింది. దానికి తోడు తోటి హీరోయిన్స్ నుంచి విపరీతమైన పోటీ, కుర్ర హీరోలు మార్కెట్ ని ఆక్రమించేయటం ఇబ్బందిగా మారాయి.

  అయితే అనుష్క తన నట విన్యాసంతో తానేంటో మరోసారి మిర్చితో ప్రూవ్ చేసుకుంది. సరైన పాత్ర పడితే తన నట విశ్వరూపం ప్రదర్శించగలనని, తనలో గ్లామర్ తగ్గలేదని మిర్చితో చెప్పినట్లైంది. దాంతో తెలుగు దర్శకులు చూపు మరోసారి అనుష్క పై పడింది. అనుష్కతో చేయాలని స్టార్ హీరోలూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆమె హాట్ గా చేసిన ఫోటో షూట్ ఫోటోలపై ఓ లుక్కేద్దామా...

  అరుంధతి, పంచాక్షరి చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసిన అనుష్క మరోసారి తన నట విశ్వరూపం ప్రదర్శించనుంది. ఆమె తాజా చిత్రం ‘బృందావనంలో నందకుమారుడు'లో ద్విపాత్రాభినయం చేస్తోంది.

  ‘బృందావనంలో నందకుమారుడు' లో ఓ పాత్ర సాధారణ గృహిణి కాగా రెండవది ఆటవిక యువతి పాత్ర. ఈ రెండు పాత్రలూ వేటికవే భిన్నంగా ఉండి,హైలెట్ అవుతాయని ధీమాగా చెప్తోంది అనుష్క.

  ఇక అటవిక యువతి పాత్రలో కేవలం ఆకులే అచ్చాదనగా ఉంచుకుని కనిపించి తన అభిమానులను అలరించనుంది. అంతేగాక ఈమె మొదటి సారిగా తన డబ్బింగ్ తానే చెప్పుకుంటోంది. ఇందుకోసం ఆమె క్లాసులకు హాజరవుతోంది.

  అనుష్క మాట్లాడుతూ- ‘‘ఈ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాను.ఇంత మంచి పాత్రలను ఇచ్చి ప్రోత్సహించిన సెల్వరాఘవన్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను'' అన్నారు.

  ‘అరుంధతి' తర్వాత నాకు అంతకన్నా గొప్ప పేరును తెచ్చిపెట్టే సినిమా ఇది. ఇందులో కొత్త అనుష్కను చూస్తారు. ద్విపాత్రాభినయం చేయడం నాకు కొత్తేం కాదు. అరుంధతి, పంచాక్షరి చిత్రాల్లో ఇప్పటికే ద్విపాత్రలు చేశాను. కానీ ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులోని నా పాత్రలు సాగుతాయి అంటోంది.

  ‘అరుంధతి తర్వాత తాను చేస్తున్న మరో పవర్ ఫుల్ రోల్ ‘రుద్రమదేవి'. ఈచిత్రం తనకు అరుంధతి రేంజిలో పేరు తెస్తుందనే నమ్మకం ఉంది' అని అనుష్క వెల్లడించింది.

  ప్రస్తుతం తనకు పలు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నా... సౌతో బిజీగా ఉండటం వల్ల చేయడానికి ఇంట్రస్టు చూడపం లేదని తెలిపింది.

  తాను గత సంవత్సరం ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఆలస్యం కావడం వల్లనే తెలుగు సినిమాలకు గ్యాప్ వచ్చిందని, తాను టాలీవుడ్‌ సినిమాలకు కావాలని దూరంగా ఉంటున్నాననే వార్తల్లో నిజం లేదని అనుష్క స్పష్టం చేసింది.

  ఆర్యతో చేస్తున్న ‘బృందావనంలో నందకుమారుడు', సూర్యతో చేస్తున్న సింగం-2 చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

  గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే ‘రాణి రుద్రమ దేవి' మూవీ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

  సూర్య సరసన ఆమె చేసిన 'సింగమ్" చిత్రం హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ ను క్యాష్ చేసుకుని తన ఖాతాలో మరి కొన్ని తమిళ సినిమాలు పడేలా చేసుకోవాలనుకుంటోంది అనుష్క.

  ప్రస్తుతం కెరీర్‌ సంతృప్తికరంగా సాగుతోంది. 'మిర్చి' ఘన విజయం సాధించటం, గుణశేఖర్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమవటం, సూర్యకు జంటగా మరోసారి అవకాశం రావటం నాకు కలిసొస్తున్న విషయాలని చెప్పింది.

  కహానీ రీమేక్‌ చిత్రంలో నటించమని శేఖర్ కమ్ముల నన్ను అడిగారు. కాల్షిసట్‌ స ర్దుబాటు కాక చేయలేదు. అయినా అన్ని సినిమాలకు నేనే చేయాలని లేదు కదా.

  ప్రస్తుతం రుద్రమదేవి, బహుబలి సినిమాలు ఒప్పుకున్నాను. వాటిపైనే దృష్టి పెట్టాలి.

  ఒక సినిమా అంగీకరించే ముందు కథకే ప్రాధాన్యతనిస్తాను. కథ ప్రకారమే పాత్రలు ఉంటాయి. ఇక కాంబినేషన్‌ సినిమాలంటే తొలుత స్కిప్ట్‌ బావుండాలి అప్పుడే అవి విజయం సాధించే అవకాశం ఉంటుంది అని అనుష్క పేర్కొంది.

  English summary
  After Mirchi Anushka paired with Surya in the film Singam 2 which is super duper hit Singam sequel. Following this success Anushka is in high spirits. Now offers are knocking her doors. But her priority is Telugu films but she will act in Tamil films which has good story and big hero. Anushka in Cloud Nine now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X