For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కేవలం ఆకులనే కప్పుకుని హాట్ అనుష్క

  By Srikanya
  |
  హైదరాబాద్ : 'అరుంధతి' చిత్రంతో తాను గ్లామర్ పాత్రలే కాదు నటనకు అవకాశమున్న పాత్రలను చేసి ఒప్పించగలనని ప్రూవ్ చేసుకున్న హీరోయిన్ అనూష్క. తాజాగా ఆమె 'బృందావనంలో నందకుమారుడు'లో కేవలం ఆకులే అచ్చాదనగా ఉంచుకుని కనిపించి తన అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో ఓ పాత్ర సాధారణ గృహిణి కాగా, రెండవది ఆటవిక యువతి పాత్ర. గృహిణిపాత్ర రెగ్యులర్ గా ఉన్నా అటవిక పాత్రలో ఆమె అద్బుతంగా చేస్తోందని తమిళ మీడియా అంటోంది.


  ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే ఒక ఎపిసోడ్‌లో ఆమె ఆటవిక యువతిగా కనిపిస్తారు. ఇందుకోసం వస్త్రాలను పక్కనపెట్టి కేవలం ఆకులనే ఆచ్ఛాదనాలుగా చేసుకొని అనుష్క నటించనున్నారు. ఈ విషయం గురించి అనుష్కకు సెల్వరాఘవన్ వివరించినప్పుడు ముందు తటపటాయించారు. తర్వాత కథలో ఆ ఎపిసోడ్‌కు ఉన్న ప్రాముఖ్యతను విన్న తర్వాత ఒప్పుకోక తప్పలేదు.
  దాదాపు అయిదువందల ఏళ్ల క్రితం ఉండే ఆటవికుల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ సాగుతుందని సమాచారం. ఆర్య కూడా ఇదే తరహాలో ఆకులతోనే నటించనుండటం విశేషం.

  అనుష్క మాట్లాడుతూ- ''ఈ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాను.'అరుంధతి' తర్వాత నాకు అంతకన్నా గొప్ప పేరును తెచ్చిపెట్టే సినిమా ఇది. ఇందులో కొత్త అనుష్కను చూస్తారు. ద్విపాత్రాభినయం చేయడం నాకు కొత్తేం కాదు. అరుంధతి, పంచాక్షరి చిత్రాల్లో ఇప్పటికే ద్విపాత్రలు చేశాను. కానీ ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులోని నా పాత్రలు సాగుతాయి. ఇంత మంచి పాత్రలను ఇచ్చి ప్రోత్సహించిన సెల్వరాఘవన్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను'' అన్నారు.

  దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ఆటవిక యువతిగా అనూష్క ఎన్నో రేర్ ఫీట్స్ చేసింది. భయంకరమైన పోరాట సన్నివేశాల్లో కూడా పాల్గొంది. ఆ పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ పాత్ర అనుష్క కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. ఈ పాత్ర కోసం అనుష్క మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది.

  అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది.అదే కథ కనుక అయితే ఆ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు.అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది. అయితే ఆర్యకు తెలుగులో ఎంత వరకూ మార్కెట్ ఉన్నది అనే దానిపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది.

  English summary
  
 Anushka is all set to send some pulses racing in Selvaraghavan’s Brundavanam Lo Nandakumarudu in which she is paired opposite Arya. Her attire for some scenes in the movie was made with just leaves. The director is all praise for her guts and her sense of adjustment when acting in these scenes. Arya and Anushka play tribals who reside in a hilly area. These scenes were shot very authentically and with lot of detailing.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more