»   » నా ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ...రాజమౌళి

నా ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ...రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్లలో అనుష్క చాలా ఇష్టం. అభిమాన హీరో ఎవరో పబ్లిగ్గా చెప్పేటంత మూర్ఖుడిని కాను. పాతవాళ్లలో రామారావుగారిని, తర్వాత చిరంజీవి గారిని ఆరాధించేవాళ్లం అంటూ మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ఎవరు? అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చారు రాజమౌళి. ఇక అనుష్క...రాజమౌళి దర్సకత్వంలో వచ్చిన విక్రమార్కుడు చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఇక తను తర్వాత చేయబోయే చిత్రం గురించి చెబుతూ...ఈగ అనే టైటిల్ తో ఓ చిత్రం అనుకున్నాను. చిన్న సినిమా ప్రయోగాత్మకంగా తీసి, తక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకున్నా. కానీ దానికి అలా కుదరదు అనిపిస్తోంది. ఆ సినిమాలో ఈగే హీరో. తర్వాత ప్రభాస్ ‌తో చేయాలి అని భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu