»   » ఆంధ్రా మిర్చి అనుష్క, రామ్ చరణ్ తేజ్ అక్కా తమ్ముల్లా!??

ఆంధ్రా మిర్చి అనుష్క, రామ్ చరణ్ తేజ్ అక్కా తమ్ముల్లా!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర" చిత్రంతో అదిరిపోయే రేంజ్ ని సంపాదించుకున్న రామ్ చరణ్ తేజ్, 'అరుంధతీ" చిత్రంతో మంచి రేంజ్ కి వెళ్లి పోయిన అందాల అనుష్కల కాంబినేషన్ లో ఓ చిత్రం రానుందని సమాచారం. వీరిద్దరూ ఇటీవల జరిగిన 'మరోచరిత్ర" ఆడియో కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో వీరిద్దరినీ చూసిన అల్లు అరవింద్ వీరిద్దరి జంట చూడ చక్కగా ఉందని అభిప్రాయ పడ్డారట.

ఈ ఇద్దరితో సినిమా తీస్తే బాగుంటుందని అనుకొని ఇదే విషయాన్ని చిరంజీవి దగ్గర ప్రస్తావించినప్పుడు అనుష్క, రామ్ కంటే కొద్దిగా పొడవుగా ఉంటుంది. కనుక అక్కా, తమ్ముళ్లుగా నటిస్తే బాగుంటుందని చిరంజీవి అన్నారట. గతంలో షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్ లో హిందీలో రూపొందిన 'జోష్" చిత్రాన్ని అరవింద్ తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడని సమాచారం. ఇందులోనే అనుష్క, రామ్ చరణ్ అక్కా, తమ్ముళ్లుగా కలిసి నటిస్తారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu