»   » అనుష్క ‘రుద్రమదేవి’ఎంతవరకూ వచ్చింది?

అనుష్క ‘రుద్రమదేవి’ఎంతవరకూ వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్ పతాకంపై భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రానికి సంబంధించిన రెండోషెడ్యూల్ పూర్తయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఆగస్టు 1 నుండి ప్రారంభం కానుంది.

గుణశేఖర్ మాట్లాడుతూ- రెండో షెడ్యూల్‌లో వేయి స్తంభాలగుడి, రంగమంటపం సెట్లలో అనుష్కపై ఒకపాట, మొగిలిచర్ల ఏకవీరాదేవి ఆలయం సెట్‌లో మహామంత్రి శివదేవయ్యగా నటిస్తున్న ప్రకాష్‌రాజ్‌పై ఓ బిట్ సాంగ్, అనుష్కపై పేర్ని శివతాండవం చిత్రీకరించామని తెలిపారు. చిత్రంలోని తారాగణమంతా ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడంతో45 శాతం షూటింగ్ పూర్తయ్యిందని ఆయన తెలిపారు.

అలాగే హీరో శ్రీకాంత్ పిల్లలు రోషన్, 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న చాళుక్య వీరభద్రుడి పాత్రలో చిన్నప్పటి రాణాగా నటిస్తున్నారని, అలాగే కూతురు మేథ తొమ్మిదేళ్ల ప్రాయంలో వున్న రుద్రమదేవిగా నటిస్తున్నారని, ప్రస్తుతం వీరిద్దరికి గుర్రపు స్వారీ, కత్తియుద్ధాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం అన్నారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Rudhramadevi is historic film in 3D, simultaneously produced in Telugu and Tamil languages. The film is directed by Gunasekhar, and stars Anushka Shetty, Rana Daggubati in the lead roles, with Prakash Raj and Krishnam Raju in supporting roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu