For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బర్త్ డే స్పెషల్: అనుష్క గురించి ఆసక్తికర విషయాలు!

  By Bojja Kumar
  |
  Anushka Setty Birthday Special అనుష్క బర్త్ డే స్పెషల్

  టాలీవుడ్లో అందం, అభినయం, ఆకట్టుకునే శరీర సౌష్టవం ఉన్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు స్వీటి..అదేనండి..అనుష్క శెట్టి.. తెలుగు మరియు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఎన్నో అవార్డు లను సొంతం చేసుకుని సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క. ఈ రోజు అనుష్క పుట్టిన రోజు. ఈ సందర్బంగా అనుష్క గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

  అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో వర్క్ చేశారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని భావించిందట. నాగ చైతన్యకు యోగాలో శిక్షణ ఇచ్చింది. అలా నాగార్జునతో పరిచయం ఏర్పడింది. 'సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

  అనుష్క

  అనుష్క

  అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి. సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా పేరు మార్చుకుంది. అనష్క సినీ రంగ ప్రవేశం అందాల ఆరబోతతోనే ప్రారంభం అయింది. తన సోకుల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపింది. వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా, ఇటీవల బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో వీరనారిగా కనిపించినా ఆమెకు ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను ఏలుతోంది.

  బిజీ హీరోయిన్

  బిజీ హీరోయిన్

  ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ వస్తోంది

   అనుష్క

  అనుష్క

  తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు అటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు. హీరోయిన్ గా టాప్ లో ఉన్న అనుష్క ‘సైజ్ జీరో' లాంటి సినిమాలు చేయడం విశేషం. ఈ సినిమా కోసం ఆమె భారీగా బరువు పెరిగారు.

  భారీ ప్రాజెక్టులు...

  భారీ ప్రాజెక్టులు...

  అనుష్క నటించిన బాహుబలి 2 మూవీ ఇటీవలే విడుదలైంది. గ్లామర్ పాత్రలతో పాటు, భారీ యాక్షన్ పాత్రలకు అనుష్కను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు. ప్రస్తుతం ‘భాగమతి' అనే చిత్రంలో అనుష్క నటిస్తోంది.

  English summary
  Anushka setty birth day special..Sweety Shetty (born 7 November 1981), known by her stage name Anushka Shetty, is an Indian actress and model who predominantly works in Telugu and Tamil films. She has received several accolades, including three CineMAA Awards, a Nandi Award, TN State Film Awards and three Filmfare Awards from eight nominations.She made her acting debut with the 2005 Telugu film Super, which garnered her a Filmfare Best Supporting Actress – Telugu nomination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X