»   » క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్, సిడ్నీలో అనుష్క శర్మ....(ఫోటో)

క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్, సిడ్నీలో అనుష్క శర్మ....(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇండియా-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా సిడ్నీ క్రికెట్ స్టేడియంలో దర్శనమిచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లి ఆట చూసేందుకే అమ్మడు ఇక్కడిదాకా వచ్చిందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతంలో అనుష్క శర్మ వచ్చిన సందర్భంలో విరాట్ కోహ్లి విఫలం అయ్యాడు. ఈ రోజు అదే మళ్లీ రిపీట్ అయింది. సెమిఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లి కేవలం 1 పరుగు చేసి ఔట్ అయ్యారు. దీంతో పలువురు క్రికెట్ అభిమానులు అనుష్క శర్మపై మండి పడుతున్నారు. ఆమె అనవసరంగా ఆస్ట్రేలియా వచ్చి మ్యాచ్‌కు ముందు కోహ్లితో రొమాన్స్ చేసిందని, ఆమె మత్తు వదలకే కోహ్లి మైదానంలో సరిగా ఆడలేక పోయాడని పలువురు క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఏమాత్రం సమయం దొరికినా ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ విషయం బహిరంగ రహస్యమే.

Anushka Sharma cheering in Sydney!

విరాట్ కోహ్లి-అనుష్క శర్మ అనేక సందర్బాల్లో కలిసి తిరిగుతూ దొరికి పోయారు కూడా. గత క్రికెట్ టోర్నమెంట్లలో కొన్ని మ్యాచుల్లో విరాట్ కోహ్లి పెర్ఫార్మెన్స్ పరంగా ఫెయిల్ అవ్వడానికి అనుష్క శర్మతో తిరగడమే కారణమనే విమర్శలుకూడా అప్పట్లో వచ్చాయి. బిసిసిఐ కూడా ఈ వ్యవహారంపై అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేసింది.

బిసిసిఐ చేసిన విమర్శలపై ఇంతకాలం మౌనంగా ఉన్న అనుష్క శర్మ ఇప్పుడు నోరు విప్పింది. తను నటిస్తున్న ఎన్ హెచ్ 10 సినిమా విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...‘విరాట్ కోహ్లీ గతంలో సరిగా పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడానికి నేనే కారణం అనడం హాస్యాస్పదం. ఫీల్డ్‌లో విరాట్ కోహ్లి పెర్ఫార్మెన్స్‌కు నేను కారణం ఎలా అవుతాను? వాళ్లు క్రికెటే ఆశ-శ్వాసగా జీవిస్తారు. వాళ్లని చిన్న పిల్లల్లా చూడొద్దు..పెద్ద వాళ్లలా ట్రీట్ చేయండి' అంటూ వ్యాఖ్యానించింది.

అదే సమయంలో ‘విరాట్ కోహ్లి ప్రభావం నా ప్రొఫెషనల్ పెర్పార్మెన్స్‌పై ఏమాత్రం ఉండదు. అదేవిధంగా నా ప్రభావం కూడా అతనిపై ఉండదు. విరాట్ సామర్థ్యంపై ఎందుకంత అనుమానం? అతను సాధించిన వాటికి క్రిడిట్ అతనికే ఇవ్వండి' అంటూ అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. ఈ విధంగా బిసిసిఐకి అనుష్క శర్మ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

English summary
Bollywood's ace heroine Anushka Sharma is caught cheering for Indian team and also her boyfriend Virat Kohli at Sydney Cricket Ground today on the eve of India-Australia semifinal match. She has flown down all the way from Mumbai a couple of days back after wrapping up the final promotions of her maiden production venture "NH 10" that nots doing quite well at theatres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu