»   » కాబోయేవాడిపై నమ్మకంతోనే ముద్దుసీన్లపై అనుష్క అలా!

కాబోయేవాడిపై నమ్మకంతోనే ముద్దుసీన్లపై అనుష్క అలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ మధ్య తను నటిస్తున్న ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ ముద్దు సీన్లతో అదరగొడుతోంది. ఇలాంటి సన్నివేశాల్లో నటించడంపై ఆమె తనదైన వాదన వినిపిస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా ముద్దు సీన్లలో నటిస్తానని తేల్చి చెప్పింది.

కొందరు హీరోయిన్లు పెళ్లికి ముందు ముద్దు సీన్లలో నటించి.... పెళ్లయిన తర్వాత అలాంటి సీన్లకు దూరంగా ఉండటంపై సెటైర్లు వేసింది. స్క్రిప్టు డిమాండ్ చేసినపుడు ఇలాంటి సీన్లు చేయడంలో తప్పులేదని నేను నమ్ముతాను. రొమాంటి సన్నివేశాలు, లవ్ సీన్స్ ముద్దు లేకుండా సరిగా పండవు. అయినా ఇపుడు ఇవన్నీ సర్వసాధారణమే. పెళ్లయిన తర్వాత కూడా లిప్‌లాక్ దృశ్యాల్లో నటిస్తాను. ముద్దు సీన్లను భూతద్దంలో పెట్టి చూడకుండా నటనలో భాగంగానే పరిగణించాలి అంటోంది.

Anushka Sharma Comments about Lip Locks

ప్రస్తుతం క్రికెటర్ విరాట్ కోహ్లితో పీకల్లోతు ప్రేమాయణం కొనసాగిస్తున్న అనుష్క శర్మ.... పెళ్లయిన తర్వాత అతను తన నిర్ణయాలను కాదనడనే నమ్మకంతోనే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది. ఇటీవలే ఇద్దరూ కలిసి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో ఏకాంతంగా గడిపి వచ్చారు.

ఈ పర్యటనపై అనుష్క శర్మ స్పందిస్తూ...ఇద్దరూ ఎవరి కెరీర్లో వారు బిజీగా గడిపాం. మా ఇద్దరికీ ఈ విరామం చాలా అవసరం. ఈ ట్రిప్ ద్వారా ఇద్దరం చాలా రిలాక్స్ అయ్యాం అని అంటోంది అనుష్క.

English summary
"There is nothing wrong in doing a lip lock scene before and after marriage. It does not make any impact in anyone’s personal life." Anushka Sharma said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu