»   » అనుష్క, కోహ్లి మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు

అనుష్క, కోహ్లి మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లితో డేటింగ్ చేస్తున్నట్లు గత కొంతకాలంగా గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వారు రహస్యంగా కలుస్తున్నట్లు తరచూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు కూడా లీకయ్యాయి.

చివరి సారిగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌లో దర్శనమిచ్చారు. వీరు చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటో ఒకటి మీడియాకు లీకైంది. అప్పటి వరకు వీరి మధ్య ఎఫైర్....కేవలం గాసిప్‌ వార్తగానే ఉండేది. ఆ ఫోటో లీక్ కావడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నిజమే అని నిర్ధారణకు వచ్చారంతా.

Anushka Sharma Spotted With Virat Kohli!

తాజాగా ఈ ఇద్దరూ శ్రీలంక నుండి వస్తున్న ఫ్లైట్‌లో కలిసి ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. బాంబే వెల్వెట్ షూటింగులో భాగంగా అనుష్క శర్మ శ్రీలంక వెళ్లగా.....తన ప్రియురాలిని కలిసేందుకు విరాట్ కోహ్లి శ్రీలంక వచ్చినట్లు స్పష్టమవుతోంది. బాంబే వెల్వేట్ చిత్రాన్ని అనురాగ్ కశ్యప్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

షూటింగు ముగియడంతో 'బాంబే వెల్వేట్' చిత్ర యూనిట్ సభ్యులంతా తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అనుష్కతో గడుపుతున్న విరాట్ ఆమెతో పాటు ఇండియాకు తిరుగు ప్రయాణం అయినట్లు, ఈ క్రమంలో ఈ ఇద్దరూ విమానంలో ప్రయాణీకుల కంట పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
Anushka was last seen in the news when she flew down to New Zealand to meet her rumoured boyfriend. There were even pictures of the duo in Auckland caught while on a lovey-dovey stroll. Now, the latest buzz is that the cricketer has been spotted by an onlooker in a flight from Sri Lanka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu