»   » వేసుకున్న బట్టలు కూడా బరువై... మరీ ఇంత లా కష్టపడిందట

వేసుకున్న బట్టలు కూడా బరువై... మరీ ఇంత లా కష్టపడిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బరువైన పాత్ర అని వింటూంటాం... మరీ ఎక్కువ ఎమోషన్స్ తో ఉన్న పాత్రని చేయటం లోనే కాదు మరో రకం బరువైన పాత్రలూ ఉంటాయి. అదే మేకప్... అనుకుంటాం గానీ కొన్ని సార్లు మేకప్, కాస్ట్యూంస్ కూడా నటీ నటులు మోయలేనంత బరువుగా ఉంటాయి. 56 కిలోల బరువుతో ఉన్న ఐశ్వర్యా రాయ్ 22 కిలోల కాస్ట్యూంస్ ధరించటం దేవదాస్ సినిమా కాలం లో ఒక హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ మధ్య ప్రొస్తటిక్ మేకప్ పేరుతో చేసే అలంకరణ కూడా మరింత భారమయ్యింది. లడ్డు బాబు సినిమా కోసం అల్లరి నరేష్ 25 కిలోల బరువుండే మేకప్తో కనిపించిన సంగతి తెలిసిందే కదా.

అయితే హీరోలంటే కాస్త పరవాలేదు కానీ అసలే డైటింగ్ పేరుతో తిండి మానేసి సన్నబడుతున్న హీరోయిన్లకే కాస్త ఈ కాస్ట్యూమ్స్, మేకప్ లవల్ల కాస్త ఇబ్బందే. కానీ కష్టం కదా అని మానేస్తే ఇప్పుడున్న కాంపిటీషన్ లో నెగ్గుకు రాలేరు కాబట్టి ఎంత భారమైనా మోసేస్తున్నారు. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే... లేటెస్ట్ గా సుల్తాన్ సినిమా తో మరీ పాపులర్ అయిపోయిన అనుష్క ఇప్పుడు మరో సినిమాకోసం పెద్ద కష్టమే పడింది. కాళ్ల నొప్పులతో భాదపడ్తూ కూడా చిరునవ్వుతో నటించాల్సి వచ్చింది ఇంతకీ సంగతేమిటంటే...

Anushka Sharma talks about her 17kg lehenga for a song in "Ae Dil Hai Mushkil"

అనుష్క ధరించిన లెహెంగా 17 కిలోల బరువుందట. దానికి తోడు ఆమె ఒంటిపై 3 కిలోల బరువైన ఆభరణాలు ఒకటి. మొత్తంగా 20 కిలోల బరువును ఆమె ధరించేసింది. ఇంతకీ అంత బరువున్న వాటిని ఆమె ఎందుకు ధరించింది? ఏమైనా ఫంక్షనా? అంటే ఫంక్షన్ లాంటిదేమీ కాదు గానీ.. ఓ పాట కోసం ఆమె అంత గ్రాండ్ లుక్‌లో కనిపించింది. ఆమె తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్‌లో 'చన్నా.. మేరేయా..' అనే పాట కోసం ఆ 17 కిలోల లెహెంగాను ధరించింది.

అంతబరువుతో వేళ్లపై పదే..పదే మెట్లు ఎక్కడం, దాని వల్ల బాగా ఉక్కపోతతో తెగ ఇబ్బంది పడిపోయిందట ఆమె. తాను పెళ్లి కూతురిలా చాలా అందంగానే ఉన్నా.. ఆ వేసుకున్న దుస్తుల వల్ల ఆ ఫీలింగే కలగలేదని, నడవడానికి కూడా బాగా ఇబ్బందిపడిపోయానని ఆమె ఓ నిట్టూర్పు విడిచింది. ఆమె ఫీలింగ్ ఎలా ఉన్నా.. ఆ పాటను చూసినవాళ్లంతా అనుష్కను తెగ పొగిడేస్తున్నారు. అనుష్క శర్మ చాలా అందంగా ఉందంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

English summary
"I was wearing such heavy clothes that everyone felt sorry for me. 17 kilos was the lehenga and then there was the jewellery. Everything put together, I was carrying 20 kilos at all time. All I could do was walk on my toes and my calves were getting like worked-out. It was very difficult. I had to climb these stairs again and again and it was so hot," said Anushka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu